Ennallo Vechina Hrudayam Serial Today Episode బాల ముఖం కడుక్కుంటుంటే త్రిపుర రింగ్ సింక్‌లో పడుతుంది. త్రిపుర తనని కాపాడినప్పుడు ఆ రింగ్ తన చేతిలోకి రావడం బాలకి గుర్తొస్తుంది. ఇక వడ్డీ వసూళ్ల  రత్నమాల( కరాటే కల్యాణి) తన స్టైల్‌లో వడ్డీ ఎగ్గొట్టిన ఓ వ్యక్తిని రఫ్ఫాడిస్తుంది. వారంలో వడ్డీలో అసలు మొత్తం ఇవ్వకపోతే పొలంలో పాతేస్తానని వార్నింగ్ ఇస్తుంది. రత్నమాల దగ్గరకు పెళ్లిళ్ల పేరయ్య ఓ పలాస నుంచి ఓ సంబంధం తీసుకొస్తాడు. జీడి పప్పు ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయని మీ అబ్బాయికి వాళ్ల అమ్మాయిని ఇవ్వాలని ఇంట్రస్ట్‌తో ఉన్నారని అందుకే తీసుకొచ్చానని అంటాడు. దాంతో రత్నమాల మా అబ్బి గాడికా వాడి గురించి మీకు తెలుసేంటి అని అడుగుతుంది.


కండల వీరుడు.. రత్రమాల కొడుకు గిరి. పెళ్లి వాళ్లు జీడి పప్పు ఫ్యాక్టరీలు.. కట్న కానుకలు, బంగారు జీడి తోటలు ఏం కావాలంటే అది ఇస్తామని అంటారు. దాంతో రత్నమాల మీ ప్రాణాలు ఇచ్చేస్తారా. మా పిలగాడు చేసుకోవాల్సిన పిల్లని ఎప్పుడో నిశ్చయించామని వాడు దాన్ని తప్ప ఇంకెవరినీ చేసుకోడని తమ మద్దెలోకి అడుగుపెట్టే అదృష్టం కేవలం తన మేనకోడలికి మాత్రమే ఉందని రత్నమాల చెప్తుంది. ఇంతలో గిరి బయటకు వస్తాడు.  రత్ని మాల కొడుకుతో నీ కోసం సంబంధం తెచ్చారని అనగానే గిరి చాకు కరెక్ట్‌గా పంతులు తల పక్కకి విసురుతాడు. తన మరదలు పుట్టగానే తన భార్య అయిందని వెంటనే పెళ్లి చేసేయ్‌ మని తల్లితో చెప్తాడు. దాంతో ఇప్పుడే వెళ్దామని రత్నమాల చెప్తుంది.


త్రిపుర దేవుడికి దండం పెట్టుకుంటూ తన తండ్రి జ్జాపకంగా ఉన్న ఉంగరం కనిపించకపోవడంతో ఇళ్లంతా వెతుకుతుంది. చెల్లికి పిలిచి ఉంగరం గురించి అడుగుతుంది. బాల ఆ ఉంగరాన్ని పట్టుకొని ముద్దులు పెట్టుకొని ఎప్పటికీ ఇది నా దగ్గరే ఉంటుందని జేబులో వేసుకుంటాడు. పడిపోతుందని తన  చేతి వేలికి పెట్టుకోవాలి అనుకుంటాడు. కానీ చేతికి వెళ్లకపోవడంతో తన మెడలో ఉన్న చైన్‌లో వేసుకుంటాడు. త్రిపుర, గాయత్రీ ఇళ్లంతా వెతుకుతారు. ఇంతలో రత్నమాల, గిరి ఇంటికి వస్తారు. త్రిపుర నీరు ఇస్తే గిరి త్రిపుర చేయి పట్టుకుంటాడు. చేతికి ఏమైంది అని అడుగుతాడు. ఎవరి వల్ల అయింది ఈ దెబ్బ అని వాళ్లని వదలను అని అంటాడు. జారి పడిపోతే గాయం అయిందని త్రిపుర అంటే జాగ్రత్తగా ఉండవే నీకు చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేనని అంటుంది.


ఇంతలో రమాప్రభ, ఊర్వశి రావడంతో రత్నమాల తనతో నా కోడలితో పనులు చేయించి తిని ఊరిపోతున్నావ్ అని సెటైర్లు వేస్తుంది. ఇక రత్రమాల తండ్రి రావడంతో గిరి ఆశీర్వాదం కోసం కాళ్ల మీద పడతాడు. శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు అని దీవించమని అంటుంది. గిరి తాత కాళ్లు గట్టిగా పట్టుకొని అందికీ అర్థమయ్యేలా దీవించు అని అంటాడు. 


త్రిపుర: మీ దగ్గరకు వద్దాం అనుకున్నా అత్యయ్య వడ్డీ డబ్బులు ఇవ్వాలి కదా.
రత్నమాల: వడ్డీ ఏంటి అసలు కూడా చాలా ఇవ్వాలి కానీ ఎందుకు వదిలేశామో తెలుసా నవ్వు మా ఇంటికి కోడలివి అని. మా అన్నయ్యకి ఇచ్చిన మాట అది త్వరలోనే మీ పెళ్లి అయిపోతే పైన మా అన్నహ్యాపీస్ కింద మేం హ్యాపీస్. అవునే  అమ్మీ మా అన్న మాట ప్రకారం నా కొడుకుని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్. ఇదిగో కోడలి పిల్లా మీ నాన్న చనిపోయిన సంవత్సరంలో పెళ్లి అంటే అత్తా నా చదువు అన్నావ్.. తర్వాత ఉద్యోగం అన్నావ్.. ఆ తర్వాత చెల్లి చదువు అన్నావ్ ఇప్పుడు అది ఉద్యోగం కూడా చేసేస్తుంది. నాన్న ఈసారి వాయిదాలు జాంతానైయ్. ఇదిగో తిప్పు నా కొడుకుతో నీకు పెళ్లి ఇష్టం అని చెప్పు.
గాయత్రీ: మనసులో ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పు అక్క. 
తాత: మనసులో వాడు నా మనవడే కానీ మంచి వాడు కాదు నువ్వు ఒప్పుకోకు అమ్మా.
రత్నమాల: ఓయ్ చెప్పు.
త్రిపుర: మీ ఇష్టం అత్తయ్యా.
రత్నమాల: ఒప్పేసుకుందిరా. 


బాల బాల్యానీలో ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలో తల్లి కషాయం తీసుకురావడం చూసి పడుకున్నట్లు నటిస్తాడు. అది చూసి తల్లి టెడ్డీ బియర్‌కి ఏమైంది అంటే లేచేస్తాడు. తల్లిదండ్రులు ఇద్దరూ కార్టూన్స్ చూపిస్తామని చెప్పి కషాయం తాగించేస్తారు. మరోవైపు గాయత్రీ ఆఫీస్‌లో వర్క్ చేస్తుంటుంది. ఇంతలో అనంత్ అక్కడికి రావడం చూసి ఆఫీస్‌కి వచ్చేశాడు నన్ను ఫాలో అవుతున్నాడని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపకి 50.. కార్తీక్‌కి 50.. దీపతో జ్యోత్స్న బేరం.. కూతిరి కోసం జ్యో కండీషన్‌కి దీప ఒప్పుకుంటుందా!