Nuvvunte Naa Jathaga Serial Today Episode మిధున దేవా దగ్గరకు వెళ్లి తనకి ఆకలేస్తుందని పట్టించుకోమని అడుగుతుంది. దేవా సెటైర్లు వేస్తాడు. సరిగా తిని మూడు రోజులైందని రోజూ గుడి దగ్గరకు వెళ్లి ప్రసాదం తింటున్నాను.. ఒక్కోసారి అది కూడా దొరకడం లేదు అని తన బాధ చెప్తుంది. దాంతో దేవా అయ్యో తిని మూడు రోజులు అయిందా అయినా నీ పొగరు ఏమాత్రం తగ్గలేదు అని అంటాడు. 

మిధున: మా ఇంట్లో నేను ఎప్పుడూ ఇలా పస్తులుండలేదు. ఎప్పుడూ ఖాళీ కడుపుతో పడుకోలేదు.దేవా: మంచిది ఇప్పుడు పడుకో.మిధున: అరే నేను నా బాధ చెప్తుంటే నీకు కామెడీగా ఉందా. నా భార్య పస్తులుందని కనీసం బాధ లేదా.దేవా: లేదు రాదు కూడా.మిధున: అరే కనీసం మీ ఇంట్లో వాళ్లు కూడా ఓ ఆడపిల్ల తినకుండా ఉంటోంది తనకు ఒక ముద్ద పెట్టాలి అని కూడా అనుకోవడం లేదు. బహుశా నీకు తిండి పెట్టడమే దండగ ఇక నాకు పెట్టడం కూడా అలాగే అనుకుంటున్నారేమో. దేవా: మేబీ అయిండొచ్చేమో. సీ ఈ కాలం సతీ సావిత్రీ నీకు తిండి పెడితే ఇక్కడే తిష్ట వేస్తావేమో అని పెట్డలేదేమో. అసలు రౌడీ నేనా నువ్వా ఈ దౌర్జన్యం ఏంటి. ఒక పని చేయ్  ఈ ఇంట్లోకి రావడానికి నడిరోడ్డు మీద కూర్చొని నిరాహార దీక్ష చేశావు కదా ఇప్పుడు తిండి కోసం నట్టింట్లో అలాగే నిరాహార దీక్ష చేయ్. లేదంటే ఇంకొక పరిష్కారం ఉంది. బస్తీ లోకి వెళ్లి అమ్మా తిని 3 రోజులు అయింది అని అడుక్కో ఎవరో ఒకరు పెడతారు.మిధున: ఎక్స్‌ట్రాలు చేయకు నా తిండి సమస్యకు నేనే ఏదో ఒక పరిష్కారం చూసుకుంటా.  ఆలోచించాను.దేవా: అయితే మీ ఇంటికి వెళ్లిపోతావా.మిధున: అంత ఆలోచించకు అది ఈ జన్మలో జరగదు. నేను ఈ ఇంట్లోనే వంట వండుకుంటాను. ఇకపై మన ఇద్దరికీ కలిపి  ఈ ఇంట్లోనే వంట చేయబోతున్నా.దేవా: ఏంటి వంటా. అమ్మో అమ్మో నేను అమాయకురాలు అనుకున్నా కానీ నీ మనసులో ఇంత విషం ఉందా. వచ్చి మూడు రోజులు కాలేదు అప్పుడే నన్ను నా కుటుంబం నుంచి విడదీయాలని చూస్తున్నావ్ కదా. మా నాన్న నన్ను తిట్టినా ఇంటికి రావొద్దని అన్నా సరే ఎందుకు వస్తున్నానో తెలుసా నాకు నా ఫ్యామిలీ అంటే అంత ఇష్టం. మిధున: సరదాగా తాళి కట్టిన నీకే ఇంత విలువ ఇచ్చే నేను నిన్ను ఫ్యామిలీ నుంచి ఎలా వేరు చేయాలి అనుకుంటాను. మీరు నాకు అన్నం పెట్టరు అని అర్థమైంది కాబట్టి వేరుగా వండుకుంటా అన్నాను. అలాగే నాకు చావు అయినా బతుకు అయినా ఇక్కడే ఉండాలి. మనం భార్యభర్తలం కాబట్టి నీకోసం కూడా వండుతా అన్నాను. అర్థం చేసుకోకుండా ఆవేశపడతావేంటి.దేవా: నీకు ఒక్క మెతుకు కూడా పెట్టొద్దని మా అమ్మకి చెప్తా నువ్వు ఎలా ఇక్కడి నుంచి వెళ్లవో నేను చూస్తాను.

సత్యమూర్తి పెద్ద కొడుకు ఆనంద్ దగ్గరకు వచ్చి నీకు ఉద్యోగం ఇవ్వడానికి ఆంజనేయ ప్రసాద్ గారు పిలిస్తే నువ్వే వెళ్లలేదని ఆయన చెప్పారు ఎందుకు వెళ్లలేదు అని అడుగుతాడు. దాంతో ఆనంద్ మన ఇంటి నుంచి వాళ్ల ఆఫీస్‌కి చాలా దూరం కిలోమీటర్ నడవాలి కూడా అందుకే వెళ్లలేదని అంటాడు. ఉద్యోగం కోసం ఎవరైనా చాలా కష్టపడతారు అని నువ్వు మాత్రం ఇంత బద్ధకం ఏంటి అని తిడతాడు. తనకు నచ్చిన ఉద్యోగానికి మీరు డబ్బులు ఇవ్వడం లేదు మీరు చెప్పిన ఉద్యోగం నేను చేయలేనని అని వెళ్లిపోతాడు. ఆ మాటలు మిధున వింటుంది. సత్యమూర్తి తన కొడుకుల గురించి భార్యతో చెప్పి బాధపడతాడు. ఇక మిధునని చూసి నిన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి వచ్చాడని నిన్ను చాలా ప్రేమిస్తున్నాడని ఐశ్వర్యాలు వదిలేసి గుడిలో ప్రసాదం తింటూ బతకడం ఏంటమ్మా అని అడుగుతాడు. తాళి కట్టిన వాడి కంటే ఇంకేం ఐశ్వర్యం ఉండదని మిధున అంటుంది. మిధున నీటి కోసం బయటకు వెళ్తే అక్కడ ఆదిత్యని చూసిన మిధున ఆదిత్య దగ్గరకు వెళ్తుంది. ఆదిత్య మిధున కోసం ఏడుస్తుంటాడు. ఒకరిని చూసి ఒకరు గతంలో వాళ్ల నిశ్చితార్థం గుర్తు చేసుకొని బాధపడతారు.

మిధున: ఎలా ఉన్నావ్ ఆదిత్య.ఆదిత్య: ఎలా ఉంటానో నీకు తెలీదా మిధున నా ప్రాణం నన్ను వదిలేసి వెళ్లిపోయింది. ఎందుకు బతకాలో అర్థం కాని పరిస్థితుల్లో వదిలేసి వెళ్లిపోయింది. కానీ ఏదో మూల బలమైన నమ్మకం, ఆశ ఈ ఊపిరి నిలబెట్టడానికి నా ప్రాణం తిరిగి రాకపోతుందా అని ఉంది. మిధున: ఆదిత్య నువ్వు బాగా చదువుకున్నావ్ లైఫ్‌ని ప్రాక్టికల్‌గా ఆలోచిస్తావ్ కానీ ఈ ఒక్క విషయంలో అలా ఆలోచించలేకపోతున్నావ్. మనకి పెళ్లి చేయాలని పెద్దలు అనుకున్నారు కానీ దేవుడు నా జీవితాన్ని దేవాతో ముడి పెట్టేశాడు. దేవా బలవంతంగా తాళి కట్టినా సరే  ఈ తాళి బంధంతోనే నా చావు అయినా బతుకు అయినా. ఎవరు ఎన్ని సార్లు చెప్పినా నా నిర్ణయం మారదు. దయచేసి అర్థం చేసుకో ఆదిత్య. అన్ని విషయాల్లో నన్ను అర్థం చేసుకొనే ఆదిత్య ఈ విషయంలో నన్ను అర్థం చేసుకోవడంలేదని బాధగా ఉంది. కొత్త లైఫ్ స్టార్ట్ చేయ్ ఆదిత్య. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. ఆదిత్య ఒక ఫ్రెండ్‌గా నువ్వంటే నాకు చాలా గౌరవం. మొన్న నేను అడగగానే ఒక్క క్షణం ఆలోచించకుండా దేవా తరఫున వాదించి బయటకు తీసుకొచ్చావ్. నా కోసం ఇలా వచ్చి నన్ను బాధ పెట్టకు ఆదిత్య. లేట్ అయింది నేను బయల్దేరుతా ఆదిత్య. ఆదిత్య: ఈ జన్మకు నువ్వే నా భార్యవి మిధున నా కట్టే కాలే వరకు ఇంకో పెళ్లి చేసుకోను. 

మిధున తినలేదని చెప్పిన విషయం దేవా గుర్తు చేసుకుంటాడు. లోపలికి వెళ్లి చూస్తాడు. మిధున నేల మీద చలిలో పడుకొని ఉంటుంది. అది చూసి కావాలనే సౌండ్ చేస్తాడు. మిధున లేస్తుంది. వెళ్లిపోయి ఉంటుందా లేదా అని చూడటానికి వచ్చావా నేను అంత తేలికగా నిన్ను వదిలేసి వెళ్లిపోనులే అంటుంది. దాంతో దేవా వచ్చి మిధున ఎదురుగా కూర్చొని దోమలు కుడితే భరిస్తున్నావ్.. నీరు తాగి కడుపు నింపుకుంటున్నావ్. నువ్వు అమాయకురాలివో తెలివైన దానివో తెలీదు కోపంలో నీ మెడలో తాళి కట్టాను ఆ తాళి తీసి పడేసి నీ లైఫ్ నువ్వు చూసుకోకుండా ఈ నరకం ఎందుకు అనుభవిస్తున్నావ్ చెప్పు అంటాడు. మహారాణి లాంటి లైఫ్ వదిలేసి ఈ బాధ, కష్టాలు ఎందుకు అని అంటాడు. దాంతో మిధున కష్టమైనా చావు అయినా బతుకు అయినా తాళి కట్టిన వాడితోనే అని అంటుంది. తాను బండ రాయి అని ప్రేమలు, బంధాలు, ఎమోషన్స్ అన్నీ చచ్చిపోయావని తన గుండె కరగదు అని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపకి 50.. కార్తీక్‌కి 50.. దీపతో జ్యోత్స్న బేరం.. కూతిరి కోసం జ్యో కండీషన్‌కి దీప ఒప్పుకుంటుందా!