ఫిబ్రవరి 1 రాశిఫలాలు

మేష రాశి

మీ గౌరవం పెరుగుతుంది. పనిలో నైపుణ్యం ప్రదర్శిస్తారు. అవివాహితులకు వివాహం నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. వివాదాలు పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు

వృషభ రాశి

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మీ ప్రజా సంబంధాల పరిధి పెరుగుతుంది. పని గురించి కొత్త ఆలోచనలు గుర్తుకు వస్తాయి. తొందరపాటు వల్ల ఆశించిన ఫలితాలు పొందలేరు. కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది. 

మిథున రాశి

రాజకీయాల్లో ఉండేవారితో మీ సంబంధం బలోపేతం అవుతుంది. విద్యార్థులు స్నేహితులు, ఉపాధ్యాయుల నుంచి సహకారం పొందుతారు. కొత్త మూలల నుంచి ఆర్థిక లాభం పొందుతారు. పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ప్రేమికులకు కలిసొచ్చే సమయం. 

Also Read: ఈ రాశులవారికి ఫిబ్రవరి నెలలో అంతా బావున్నట్టే ఉంటుంది కానీ మానసిక ఇబ్బందులు తప్పవ్

కర్కాటక రాశి

ఈ రోజు ఆరోగ్యాన్ని విస్మరించదు. అడగకుండా సలహాలు ఎవరికీ ఇవ్వొద్దు. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈ రోజు ముఖ్యమైన పనిని ప్రారంభించవద్దు. కెరీర్‌లో చాలా అడ్డంకులు ఉంటాయి. బయటి వ్యక్తులతో కొత్త సమస్యలు సృష్టించుకోవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. 

సింహ రాశి

ఈ రాశివారికి వ్యాపారంలో పెద్ద ఒప్పందం కుదురుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. మీ పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. కుటుంబంలో అవివాహితుల గురించి చర్చ ఉంటుంది. ఈ రాశి ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు.

కన్యా రాశి

మాట్లాడేటప్పుడు భాష జాగ్రత్త..పదాలు తూలొద్దు. ఉద్యోగులు బోనస్ పొందుతారు. అసంపూర్ణంగా ఉండే పనులు పూర్తవుతాయి. స్నేహతుల నుంచి వ్యాపారంలో మద్దతు లభిస్తుంది. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. 

తులా రాశి

మీ మనసులో ఆలోచనలు జీవిత భాగస్వామితో పంచుకోవడం మంచిది. ఉద్యోగం, వ్యాపారంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. కెరీర్ విషయంలో చురుకుగా వ్యవహరిస్తారు. అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది.

Also Read:  ఫిబ్రవరిలో ఈ రాశులవారికి గ్రహాల అనుకూల సంచారం..పట్టిందల్లా బంగారం!

వృశ్చిక రాశి

ఈ రోజు పూర్వీకుల నుంచి ఆస్తికి సంబంధించిన సమాచారం పొందుతారు. భూ సంబంధిత వ్యాపారులకు కలిసొచ్చే సమయం. ఆహార సంబంధిత వ్యాపారం చేసేవారు లాభాలు ఆర్జిస్తారు. పిల్లల భవిష్యత్ గురించి ఆందోళన ఉంటుంది. ఇంటి సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగంచండి. ఎప్పటి నుంచో వెంటాడుతున్న ఓ సమస్య పరిష్కారం అవుతుంది.

ధనస్సు రాశి

మీరున్న రంగంలో ఆధిపత్యం పెరుగుతుంది. లక్ష్యాల విషయంలో అభిరుచితో ఉండండి. ఓ శుభకార్యానికి హాజరవుతారు. ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. కొత్తగా ప్రారింభించే ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు.

మకర రాశి

కెరీర్‌లో ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయి. పరిశోధనకు సంబంధించిన పనిలో మంచి ఫలితాలు సాధిస్తారు. మిమ్మల్ని మీరు పొగుడుకోవడం తగ్గించండి. రహస్య శత్రువుల కారణంగా నష్టం ఉండవచ్చు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. 

కుంభ రాశి

ఈ రాశివారు కార్యాలయంలో శుభవార్త వింటారు.  రోజు మొత్తం సానుకూలంగా అనిపిస్తుంది. ఆరంభం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు తమ లక్ష్యాలను సాధిస్తారు. వివాహ సంబంధాలకు తగిన సమయం ఇవ్వడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

Also Read: అఘోరాలు, నాగసాధువులకు మాయమయ్యే శక్తి ఉందా.. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వెళ్లిపోతున్నారు!

మీన రాశి

ఈ రాశివారు అనుకోని వివాదంలో చిక్కుకుంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఉద్యోగాలు   ఏదో కారణంగా రాత్రి వివాదం ఉండవచ్చు. ఆరోగ్యం యొక్క ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆర్థిక లావాదేవీల్లో అవాంతరాలు ఉండొచ్చు.

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.