Solar Eclipse 2022 : దాదాపు రెండు దశాబ్దాల తర్వాత దీపావళి రోజే సూర్యగ్రహణం ఈ ఏడాది ఏర్పడుతోందని ఈనెల 25న మంగళవారం కేతుగ్రస్త సూర్యగ్రహణం స్వాతి నక్షత్రంలో గ్రహణం పట్టు విడుపులు అందరికీ గోచరమయ్యేలా సూర్యగ్రహణం ఉంటుందన్నారు. మంగళవారం సాయంకాలం 5.03 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ సూర్యగ్రహణం విడుపు అందరూ వీక్షించేలా ఈసారి గ్రహణం ఏర్పడబోతోందని రాజమండ్రి పరిసర ప్రాంత వాసులు సూర్యస్తమయ సమయం వరకు మాత్రమే ఈ గ్రహణ కాలంలో పుణ్యకార్యక్రమాలు చేయడానికి శాస్త్రబద్దంగా వీలౌంతుందన్నారు. 25న సాయంత్రం 5.35 వరకు మాత్రమే పుణ్యకార్యాలు చేయడానికి వీలు ఉంటుందని అరసవల్లి అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ వివరించారు. 


ఏఏ ప్రాంతాల్లో ఎప్పుడు


మిగిలిన ప్రదేశాల్లో గుంటూరులో 5.03 నుంచి 5.41 నిమిషాల వరకు, విజయవాడలో 5.03 నుంచి 5.40 నిమిషాల వరకు, విశాఖపట్నంలో 5.01 నుంచి 5.28 నిమిషాల వరకు తిరుపతిలో 5.11 నుంచి 5.47 వరకు బెంగుళూరులో 5.12 నుంచి 5.55 వరకు చెన్నైలో 5.14 నుంచి 5.44 నిమిషాల వరకు, న్యూఢిల్లీలో 4.29 నుంచి 5.47 నిమిషాల వరకు ప్రయాగ్ రాజ్ 4.40 నుంచి 5.26 నిమిషాల వరకు కలకత్తాలో 4.52 నుంచి 5.03 నిమిషాల వరకు ముంబయిలో 4.49 నుంచి 6.09 నిమిషాల వరకు గంట కాలం పాటు అదే విధంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిలో 4.41 నుంచి 5.22 నిమిషాల వరకు గ్రహణ కాల సమయం వీక్షణంగా ఉంటుందన్నారు. గోహతిలో సూర్యగ్రహణ ప్రభావం దర్శనం లేదన్నారు. ఈ గ్రహణ కాలసమయంలో గర్గమహర్షి వ్యాఖ్యానుసారం మేష, తుల, వృచ్చిక, మకర, కుంభ, మీన రాశులు అదే విధంగా స్వాతీ, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, నక్షిత్ర రాశుల వారు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పిన బింబ శాంతి జరిపించుకోవాలన్నారు. అతి పెద్ద సూర్య గ్రహణంగా ఈ ఏడాది అమావాస్య రోజున రాబోతున్న సూర్యగ్రహణం, దీపావళి పండుగ, కార్తీక అమావాస్య రోజు కావడంతో చాలా మందికి దీపావళి పండుగ నిర్వహణపై సైతం స్పష్టత లేదని వివరించారు. 


ఏ రాశుల వారిపై ప్రభావం 


22 ఏళ్ల తర్వాత ఏర్పడే ఈ సూర్యగ్రహణ ప్రభావం అన్ని రాశుల వారిపై పడబోతోందని శాస్త్రం స్పష్టం చేస్తోందని అరసవల్లి అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ వివరించారు. సూర్యగ్రహణం వల్ల వచ్చే చెడు ప్రభావం ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ క్రమంలో పలు జాగ్రత్తలు పాటించడం మంచిదని కార్తీక మాస అమావాస్య అక్టోబర్ 24 సాయంత్రం 5.27 నిమిషాల నుంచి మరుసటి రోజు అక్టోబర్ 25 సాయంత్రం 4.18 నిమిషాల వరకు ఉంటున్నందున ఆ లెక్కన సూర్యగ్రహణం 24వ తేదీ అర్ధరాత్రి నుంచి 12 గంటల ముందే ప్రారంభమవుతోందని గుమ్మా గణేష్ శర్మ తెలిపారు. ఈ ఏడాది ఏర్పడబోతున్న అరుదైన సూర్యగ్రహణం మొత్తం వ్యవధి కాలం 4 గంటల 3నిమిషాల పాటు కొనసాగుతోందని గణేష్ శర్మ వివరించారు. ఈ సూర్యగ్రహణాన్ని అశుభకరమైన సంఘటనగా జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనబడిందని తెలిపారు. గ్రహణ సమయంలో భోజనం చేయకూడదని దంత దావనం చేసుకోరాదని, తల దువ్వుకోవడం శుభకరం కాదని శాస్త్రి నిపుణులు స్పష్టం చేస్తున్నారని ఆయన వివరించారు. 


గర్భిణీ స్త్రీలు ఏంచేయాలి? 


ప్రధానంగా సూర్యగ్రహణసమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు రాకూడదని గుమ్మా గణేష్ శర్మ తెలిపారు. సూర్యగ్రహణ సమయంలో ఎలాంటి శుభకార్యాలయాలు జరుపుకోకూడదన్నారు. ఈ సమయంలో ఎటువంటి పూజలు, పనికిరావన్నారు. వంట గదిలో వండిన ఆహార పదార్థాల్లో తులసి ఆకులు వేయాలని సూర్యభగవానుని పూజించి సూర్యనారాయణ మంత్రం పఠించాలన్నారు. గ్రహణం ముగిసిన తర్వాత ఇళ్లు, దుకాణం శుభ్రం చేసుకోవాలని  సూచించారు. నివసించే ప్రదేశాల గంగాజలంతో శుద్ది చేసుకోవాలన్నారు. గ్రహణం తర్వాత స్నానం చేయడం ఎంతో శ్రేయస్ర్కరమన్నారు. ఆ సమయంలో దూపం, దీపం వంటివి అస్సలు వాడవద్దని స్పష్టంచేశారు. గర్భిణీ స్త్రీలు, జాతక దోషాలు ఉన్న వారు సూర్యగ్రహణ సమయంలో ఇంటినుంచి బయటకురావొదన్నారు. దీపావళి రోజే సూర్యగ్రహణం ఏర్పడినందున ఈ ఏడాది లక్ష్మీపూజకు దూరంగా ఉంటేనే అన్ని విధాలుగా మంచిదని దీపావళి రాత్రి నుంచి సూర్యగ్రహణ ప్రభావంతో సూతక ప్రభావం ఉంటుందని దీపావళి రాత్రి నుంచే దీనిని పాటించాల్సి ఉంటుందన్నారు. మంగళవారం తులారాశిలో సూర్యగ్రహణం ఏర్పడబోతోందని గుమ్మా గణేష్ తెలిపారు. 


నాలుగు గంటల పాటు సూర్యగ్రహణం 


ఈ దఫా సూర్యగ్రహణం 4 గంటల 3 నిమిషాల పాటు గమన కాలంగా ఉంటుందని ఆలయ అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ  తెలిపారు. 2019-20 తర్వాత ఏర్పడిన ఈ పెద్ద సూర్యగ్రహణ ప్రభావంం దేశంలోనూ ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుందని తెలిపారు. కార్తీక మాసం అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడినందున ఆరోజున పుణ్యస్నానాలు ధానాదులు చేయడం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంటుందని ఇటువంటి చర్యల తర్వాత మానవ శరీరం అపవిత్రంగా మారుతుందని గ్రంధాల్లో చెప్పబడిందన్నారు. సూర్యగ్రహణ ప్రభావం నుంచి అన్ని విధాలుగా రక్షణ పొందేందుకు స్నానం చేయడం ఎంతో శ్రేయస్సు కరమన్నారు. వాస్తవానికి రాహుకేతువుల గమనంతో సూర్యగ్రహణం ఏర్పడుతోందని మత విశ్వాసాలు స్పష్టం చేస్తున్నాయని అరసవిల్లి ప్రధాన అర్చకులు శంకర శర్మ వివరించారు. 


నోట్: పండితుల నుంచి, కొన్ని పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఇది. దీన్ని మీరు ఎంతవరకూ విశ్వసిస్తారన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం