26th November 2022 Daily Horoscope Today: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో మంచి పేరు సంపాదిస్తారు. తలపెట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. విద్యార్థులకు శుభ సమయం. అదృష్టం కలిసొస్తుంది. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. కొత్త వ్యక్తులను కలుస్తారు
వృషభ రాశి
ఆర్థిక సమస్యను అధిగమించడానికి అప్పు చేయాల్సి రావొచ్చు. వ్యాపార పరిస్థితి అంత బాగా ఉండదు. ఈ రోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. స్నేహితుల సహాయంతో కొత్త ప్రాజెక్టు ప్రారంభించవచ్చు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
మిథున రాశి
మారుతున్న వాతావరణం కారణంగా ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. కుటుంబంలో వివాదాలు పరిష్కారమవుతాయి. మీరు పనిచేస్తున్న రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ కు సంబంధించిన సమచారం అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి
Also Read: మానవ శరీర నిర్మాణానికి - 14 లోకాలకు ఉన్న సంబంధం ఇదే
కర్కాటక రాశి
ఈ మీకు రోజు సంతోషకరమైన రోజు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఎవ్వరికీ సలహాలు ఇవ్వకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు మీ అజాగ్రత్త కారణంగా నష్టం జరుగుతుంది.
సింహ రాశి
ఈ రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు అవుతుంది. గ్రహాల అనుకూల ప్రభావం వల్ల ధనలాభం ఉంటుంది.మీకు అదృష్టం కలిసొస్తుంది. టెన్షన్ తగ్గుతుంది. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. మీరు రిలాక్స్‌గా ఉంటారు.
కన్యా రాశి
ఈ రోజు మిశ్రమ దినంగా ఉంటుంది. నిలిచిపోయిన పాత పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. తెలియని వ్యక్తుల నుండి దూరం పాటించండి. చదవాలనే ఆసక్తి ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.. ఇంకా చదవండి
Also Read: ఇరుముడి అంటే ఏంటి, అయ్యప్ప స్వామి దర్శనానికి ఇరుముడి ఎందుకు!
తుల రాశి
మీకు అదృష్టం కలిసొస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇంటి బాధ్యతల్లో బిజీగా ఉంటారు. ఇంటా బయటా గౌరవం పొందుతారు. స్నేహితులను కలుస్తాను .
వృశ్చిక రాశి
మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వ్యాపార రంగంలో అదృష్టం బావుంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పెద్దల ఆశీస్సులు ఫలిస్తాయి. ఆలోచనలు మారవచ్చు.. ఆరోగ్యం బాగుంటుంది, యోగాభ్యాసం మేలు చేస్తుంది. జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి..
ధనుస్సు రాశి
అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. సన్నిహితుల నుంచి విచారకరమైన వార్త వింటారు. అవసరమైన వారికి సహాయం చేస్తారు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు
మకర రాశి
కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. మీ ప్రవర్తనలో మార్పు మీకు తెలుస్తుంది. ఆధ్యాత్మిత వ్యవహారాల కోసం ఖర్చు చేస్తారు. ఎవరితోనూ కోపంగా మాట్లాడవద్దు. ఒకరి సలహాను అనుసరించడానికి తొందరపడకండి. నిరుద్యోగులకు ఇంటర్యూకి పిలుపు వస్తుంది.
కుంభ రాశి
ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. ఈ రోజు ఆహ్లాదకరమైన రోజు అవుతుంది. పోటీ పరీక్షలురాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారం బాగా సాగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కుటుంబంలో సంక్షోభం తొలగిపోతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మీన రాశి
మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి అవకాశాలను పొందుతారు. కొత్త కంపెనీ నుంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. ఈ రోజు చాలా మంచిరోజు. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి.
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి