YSRCP support Amit Shah: దేశవ్యాప్తంా  పార్లమెంట్‌లో  రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ అంశంలో రాజకీయ పార్టీలన్నీ తమ అభిప్రాయాలను చెబుతున్నాయి. సహజంగానే ఎన్డీఏ పార్టీలు ఎన్డీఏను సమర్థిస్తున్నాయి. ఇండీ కూటమి పార్టీలు అమిత్ షాపై ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ఏ కూటమిలో లేని వైసీపీ అనూహ్యంగా అమితా షాకు మద్దతుగా నిలిచింది. ఆయన చేసిన వ్యాఖ్యల్ని సమర్థించిది.  అమిత్ షా అంబేద్కర్ అగౌరవ పర్చలేదని తెలిపిది. వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో వేసిన  ఈ ట్వీట్   వైరల్ అవుతోంది.   






సహజంగా బీజేపీకి మిత్రులుగా ఉన్న టీడీపీ, జనసేన ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. ఆ కారణంగా వైసీపీ బీజేపీ కూటమిని, ఆ కూటమిలోని నేతల్ని సమర్థించకూడదు. పైగా ఇటీవలి కాలంలో జగన్ ఢిల్లీలో  దర్నా చేశారు. ఆ ధర్నాకు సపోర్టు చేసిన వారంతా ఇండీ కూటమి పార్టీలకు చెందిన నేతలే. తనకు కష్టం వచ్చినప్పుడు వారంతా వచ్చి సపోర్టు చేసినా జగగన్ మాత్రం ఇలాంటి కీలక విషయాల్లో ఇండీ కూటమి ఆందోళనలకు మద్దతు ఇవ్వడం లేదు. సరి కదా బీజేపీకి మద్దతు పలుకుతున్నారు. జమిలీ ఎన్నికల విషయంలోనూ వైసీపీ బీజేపీ కూటమికే మద్దతు తెలిపింది. 


Also Read: ఐపీఎస్ సీతారామాంజనేయుల్ని ఎందుకు అరెస్టు చేయలేదు - సీఐడీని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు


అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్, మిత్రుపక్షాలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నాయి. ఆయన రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచారని అంటున్నాయి. అంబేద్కర్ ను స్మరించుకోవడం కన్నా దేవుడ్ని స్మరించుకోవడం బెటరని ఆయన అన్నారని ఆరోపిస్తున్నారు . ఈ అంశంపై ఆయన వివరణ ఇచ్చారు. అయినా కాంగ్రెస్ మిత్రపక్షాలు ఏ మాత్రం అంగీకరించడం లేదు. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 



Also Read: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?