AP High Court reserved its verdict on the anticipatory bail of the police officers in the Jatwani case : ఏపీ హైకోర్టులో నటి జత్వానీ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పై విచారణ జరిగింది.ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిది. ఏ 2గా ఉన్న సీతారామాంజనజేయులు కనీసం ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేయలేదని  ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. హీరోయిన్ జత్వానీని వేధించిన కేసులో.. కేసులు నమోదు కావడంతో ఇతర ఐపీఎస్‌లు, పోలీసులు ముందస్తు బెయిల్ కోసంకోర్టుకెళ్లారు. విచారణ పూర్తయ్యే వరకూ వారిని అరెస్టు చేయవద్దని కోర్టు చెప్పింది. తాజా విచారణ తర్వాత కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 


సినీనటి కాదంబరి జత్వానీ ఫోర్జరీ డాక్యుమెంట్‌తో జత్వానీ తన భూమిని విక్రయించేందుకు ప్రయత్నించారని కుక్కల విద్యాసాగర్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఫిర్యాదు చేశారు. అదే రోజు ఉదయం 6 గంటలకు పోలీసులు కేసు నమోదు చేశారు.  తనపై ఏపీ పోలీసులు తప్పుడు కేసు పెట్టి ముంబై నుంచి అరెస్టు చేసితీసుకు వచ్చారని నలభై ఐదు రోజుల పాటు వేదించారని ఆరోపించారు. ప్రభుత్వం మారిన తర్వాత దీనిపై పోలీసులు విచారణ జరిపారు.  కుక్కల విద్యాసాగర్‌ నుంచి ఫిర్యాదు అందకముందే జత్వానీని కేసులో ఇరికించేందుకు పోలీసులు ఉన్నతాధికారులు ప్రణాళిక రచించారని ఆరోపణలు ఉన్నాయి.


Also Read:  ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి


 విజయవాడ డీసీపీగా పనిచేస్తూ విశాఖకు బదిలీ అయిన విశాల్‌ గున్నీని రిలీవ్‌ చేయకుండా జత్వానీ కేసును పర్యవేక్షించేందుకు ముంబైకి పంపించారని..  అక్కడి నుంచి వచ్చిన తర్వాతే రిలీవ్‌ చేస్తామని గున్నీకి అప్పటి విజయవాడ కమిషనర్‌ కాంతి రాణా చెప్పారని హైకోర్టులో అడ్వకేట్ జనరల్ వదాిచంారు.  క్రమశిక్షణ సంఘం ముందు విశాల్‌ గున్నీ ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారన్నారు.  కేసు నమోదయ్యే సమయానికి ముంబైకి వెళ్లేందుకు ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్ని, ఇతర పోలీసు అధికారులు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. జత్వానీని కేసులో ఇరికించేందుకు పిటిషనర్లు కుట్ర చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయిని ఏజీ వాదించారు. 



Also Read: Tirumala: తిరుమలలో రాజకీయాలు మాట్లాడిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ - కేసులు నమోదు చేయాలంటున్న భక్తులు