పతియే ప్రత్యక్ష దైవం అని మన పెద్దలు చెప్తుంటారు. మరి నిజంగా భర్తకు గుడి కట్టి పూజలు చేస్తే? అవును మీరు విన్నది నిజమే. అది జరిగింది ఎక్కడో కూడా కాదు. మన తెలుగు రాష్ట్రంలోనే.  ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఒక ఇల్లాలు తన భర్తను దైవంలా కొలుస్తోంది. జిల్లాలోని పొదిలి మండలం నిమ్మవరం గ్రామానికి చెందిన అంకిరెడ్డి, పద్మావతి భార్యాభర్తలు. అంకిరెడ్డి నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భర్త అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆమె తల్లడిల్లింది. భర్తను స్మరించుకుంటూ కాలం వెళ్లదిస్తోంది.


అందుకే గుడి కట్టాం.. 
భర్త చనిపోయిన కొన్ని రోజులకు ఒకరోజు కలలో అంకిరెడ్డి కనిపించి తనకు ఒక గుడిని కట్టాలని తనని కోరారని పద్మావతి తెలిపింది. దీంతో తాము గుడి కట్టించామని పద్మావతి చెబుతోంది. తన భర్త రూపంతో పాలరాతి విగ్రహం ప్రతిష్టించి.. నిత్యం పూజలు చేస్తున్నట్లు తెలిపింది. తన భర్త జీవించి ఉన్నప్పుడు కూడా ఆయనను దైవం లానే భావించేదానినని చెప్పింది. 


Also Read: Raghu Rama Vs YSRCP: వైఎస్ఆర్‌సీపీ వర్సెస్‌ వైఎస్ఆర్‌సీపీ.. ఢిల్లీలో టెన్షన్ రేపుతున్న రఘురామ - వైసీపీ ఎంపీల పోటాపోటీ రాజకీయం..!


ప్రతి పౌర్ణమికి అన్నదానం..
అంకిరెడ్డి పుట్టినరోజుతో పాటు ప్రత్యేక రోజులలో ఇక్కడ పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామని పద్మావతి వెల్లడించింది. ప్రతి పౌర్ణమికి ఈ గుడిలో పేదలకు అన్నదానం చేస్తామని పేర్కొంది. తన కుమారుడు శివ శంకర్ రెడ్డి, అంకిరెడ్డి స్నేహితుడు తిరుపతిరెడ్డి సహకారంతోనే ఈ సేవలు చేస్తున్నట్లు పేర్కొంది. ఇలాంటి ఆదర్శ దంపతులకు బిడ్డగా పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని అంకిరెడ్డి, పద్మావతిల కుమారుడు శివశంకర్ రెడ్డి అన్నాడు. 


గతంలోనూ ఇలాంటి ఘటనలు.. 
సరిగ్గా పైన చెప్పిన మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలోనూ ఓ ఘటన జరిగింది. అక్కడ తాతకు మనవడు గుడి కట్టించాడు. వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్‌ మండలం నావల్గ గ్రామానికి చెందిన మొగులప్పకు పిల్లలు లేరు. తన తమ్ముడి మనవడిని దత్తత తీసుకున్నాడు. ఆ బిడ్డను తండ్రి లాగా పెంచి పెద్ద చేశాడు. 2013లో మొగులప్ప కన్నుమూయడంతో మనవడు తట్టుకోలేకపోయాడు. తాత జ్ఞాపకార్థం తన సొంత భూమిలో గుడి కట్టించాడు. దీనికి మొత్తం రూ.24 లక్షల వరకు ఖర్చు అయిందని మొగులప్ప మనవడు ఈశ్వర్ తెలిపాడు. 


Also Read: India Covid Cases: మళ్లీ కరోనా కేసులు రైజ్‌.. ఆ ముప్పు పొంచే ఉందన్న కేంద్రం.. ఏపీ, తెలంగాణలో ఊరట