Weather Updates: అల్పపీడన ద్రోణి దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ వరకు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. తక్కువ ఎత్తులో ఈశాన్య దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా నేడు ఏపీలో వాతావరణం పొడిగా మారుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అకాల వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలి గాలులలో ప్రజలు ఉదయం వేళ ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు తెలంగాణలోనూ చలి గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గాయి.
రాష్ట్రంలో అల్పపీడన ప్రభావం ఉన్నప్పటికీ కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నేడు వాతావరణం పొడిగా ఉంటుంది. వర్ష సూచన లేకపోవడంతో మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చునని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో ఉదయం వేళ చలి గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయని, కొన్ని కోట్ల పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు వర్ష సూచన లేదు. ఈరోజు, రేపు వాతావరణం పొడిగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు తగ్గడంతో రైతుల ధాన్యం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. కోస్తాంధ్రతో పోల్చితే రాయలసీమలో చలి తీవ్రత అధికంగా ఉంది. సీమలో పలు చోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదు కానున్నాయి. కొన్నిచోట్ల ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. ఈశాన్యం నుంచి గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి.
Also Read: Nellore: చాట్ తిను డైస్ వేయ్... నెల్లూరు హోటల్ లో కొత్త కాన్సెప్ట్... బిల్లులో భారీ డిస్కౌంట్..!