AP Rain Updates: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం వాయుగుండం తమిళనాడు తీరం వైపుగా కదులుతుందని, దీని ప్రభావం తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంట 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. నైరుతి నుంచి 70 కిలోమీటర్ల వేగంతో తీరం వెంట గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురవనున్నాయి.
యానాం, ఉత్తర కోస్తాంధ్రలో వెదర్ అప్‌డేట్స్
శ్రీలంకలోని ట్రింకానమలీకి 180 కి.మీ తూర్పుగా, తమిళనాడు నాగపట్నానికి 470 కి.మీ దూరంలో, పుదుచ్చేరికి 470 కి.మీ దూరంలో, చెన్నైకి 530 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం ఏపీలో మార్చి 4 అర్ధరాత్రి నుంచి మొదలవుతుంది. అల్పపీడనం ఎఫెక్ట్, ఆగ్నేయ గాలుల ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. తీరం వెంట బలమైన గాలులు దక్షిణ దిశ నుంచి 50 నుంచి 60 కి. మీ వేగంతో వీస్తాయని హెచ్చరించారు. అయితే ఉత్తర కోస్తాంధ్రంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. జంగమేశ్వరపురం, బాపట్లలో, నందిగామలో, అమరావతిలో, తునిలో, విశాఖపట్నంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో దక్షిణ కోస్త్రాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. మరో 36 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ తూర్పు శ్రీలంక తీరం వెంట ఉత్తర తమిళనాడు వద్ద తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మార్చి 6, 7 మరియు 8 న వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో ఉష్ణోగ్రత కొంత తగ్గడంతో వాతావరణం చల్లగా ఉంటుంది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
అల్పపీడనం ప్రభావం తమిళనాడు, శ్రీలంకతో పాటు తెలంగాణపై సైతం ఉంటుంది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుతాయి. కొన్ని చోట్ల వాతావరణం పొడిగా మారుతుంది. వాయుగుండం ప్రభావంతో ఆగ్నేయ దిశ నుంచి గంటలకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అల్పపీడనం తమిళనాడు తీరాన్ని రాత్రి తాకే అవకాశం ఉంది. మొదట తమిళనాడు, లంక తీరంలో వర్షాలు కురుస్తాయి. ఏపీలో ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉండగా, తెలంగాణలో చిరు జల్లులు పడతాయి.
Also Read: Gold-Silver Price: మళ్లీ కొండెక్కిన పసిడి ధర, నేడు మరింతగా, స్థిరంగా వెండి
Also Read: AP Police Vs YSRCP Leaders: ఏపీ పోలీసన్నా .. అధికారానికి ఇంత అలుసైపోయావేంటన్నా !?