తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత కాస్త తగ్గింది. కొన్ని రోజులుగా ప్రజలను అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు వణికించిన సంగతి తెలిసిందే. తాజాగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఉత్తర దిశ నుంచి వీచే చల్లని గాలులు ఆగిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గిందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. తాజాగా ఆగ్నేశ దిశ, ఉత్తర దిశల నుంచి గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. వీటి ప్రభావం అంతంతమాత్రంగానే ఉండటంతో ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతున్నాయి.
తెలంగాణలో గురువారం (డిసెంబరు 30) వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. అయితే, వర్షాలకు సంబంధించి హెచ్చరికలు ఏమీ లేవని స్పష్టం చేశారు. బుధవారం నాడు రాష్ట్రంలో నిజామాబాద్ సహా కొన్ని చోట్ల వడగండ్ల వాన కురిసింది.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ ఇలా..
తూర్పు వైపు, ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్నట్లుగా వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి నుంచి రెండు రోజులపాటు పలు ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అటు విశాఖ ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇంకా ఉంటున్నాయి. ఆంధ్రా కశ్మీర్‌గా చెప్పుకునే లంబసింగి, పాడేరు పక్కన ఉన్న వంజాంగి, పెదబాయలులోనూ చలి తీవ్రంగానే ఉంది. ఏపీలోని అనంతపురంలో అత్యల్పంగా 16.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత జంగమేశ్వరంలో 16.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంనట్లుగా అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు.
Also Read: KTR: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్