Weather Latest News: ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో తెలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలో తెలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చొట్ల కురిసే అవకాశం ఉంది. వాతావరణ హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు.
హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ దిశలో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 26.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.3 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 83 శాతంగా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
నిన్నటి వాయువ్య బంగాళాఖాతం ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ బంగ్లాదేశ్, దానిని ఆనుకొని వాయువ్య బంగాళాఖాతం మీద సముద్ర మట్టానికి సగటున 0.9 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
నిన్నటి దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపైన మలక్కా జలసంధి పరిసరాల్లో 27న ఉదయం 8.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 29 నవంబర్ 2023 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత ఈ వాయుగుండం వాయువ్య దిశగా కదిలి ఆగ్నేయ బంగాళాఖాతంలో తదుపరి 48 గంటల్లో తుపాను బలపడే అవకాశం ఉందని తెలిపారు. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని తెలిపారు.
వీటి ప్రభావం ఏపీపై కాస్త ఉండనుంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.