ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలు అతి భారీ వర్షాలతో చిగురుటాకులా వణుకుతున్న సంగతి తెలిసిందే. కడప, చిత్తూరు, అనంతపురం వంటి జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇంకా వరద నష్టం నుంచి అక్కడి ప్రజలు కోలుకోకముందే మరోసారి వర్ష సూచన ఉదంటూ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు అమరావతి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రానున్న 24 గంటల్లో దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ప్రకటించింది.
దీని ప్రభావం శ్రీలంక, దక్షిణ తమిళనాడుపై తీవ్రంగా ఉండబోతుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు. దక్షిణ తమిళనాడు తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తమిళనాడుపై ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటుండగా.. చిత్తూరు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
తెలంగాణలో ఇలా..
తెలంగాణలో వాతావరణ పరిస్థితుల అంచనాలను హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాగల 5 రోజులకు సంబంధించి వాతావరణం ఇలా ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. వర్షాలకు సంబంధించి ఏ జిల్లాలోనూ హెచ్చరికలు చేయలేదు.
Also Read: అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణ ఘటన... స్నేహితుడికి మద్యం తాగించి అతడి భార్యపై అత్యాచారం, ఆపై హత్య...
Also Read: KCR In Delhi: ఒడువని ధాన్యం సేకరణ ముచ్చట.. ఢిల్లీలోనే సీఎం కేసీఆర్, మంత్రులు
Also Read: ఇద్దరివీ వీఆర్వో ఉద్యోగాలు, అన్నీ పాడుపనులే.. ఏళ్లుగా వారికి గాలం.. చివరికి ఇలా..