Weather Latest News: తూర్పు గాలులలోని ద్రోణి  కొమరెన్ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం  వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో తెలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలో తెలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చొట్ల కురిసే అవకాశం ఉంది. వాతావరణ హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు.


హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో తూర్పు దిశలో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 31.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.1 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 76 శాతంగా నమోదైంది.


ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
సగటు సముద్ర మట్టం వద్ద తూర్పు గాలలో ఏర్పడిన ద్రోణి ఇప్పుడు కొమరీన్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ అనగా ఆంధ్రప్రదేశ్ తీరం వరకూ సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకూ విస్తరించి కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


వీటి ప్రభావం ఏపీపై కాస్త ఉండనుంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.


దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.


రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.