Srikakulam News :  ఆయన రెండుసార్లు ఎంపీ అయ్యారు. మూడో సారి విజయం సాధిస్తానంటు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన దువ్వాడ శ్రీనివాసును ఎమ్మెల్సీగా నియమించారు.  అనంతరం పార్లమెంటు స్థానానికి ఆ పార్టీ నుంచి ఎవరు కూడా ఇన్చార్జిగా లేరు.  కేంద్ర మాజీ మంత్రి కిల్లి  కృపారాణి  పార్టీలో  ఉన్నప్పటికీ ఆమెకు  కూడా బాధ్యతలు అప్పగించలేదు . రానున్న ఎన్నికల్లో పార్టీలో ఉన్న సీనియర్లను మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాసు , స్పీకర్ తమ్మినేని సీతారాం లో ఒకర్ని ఎంపీ అభ్యర్థిగా  బరిలో దించాలని  సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు . వీరు  ముగ్గురు కూడా ఆసక్తి చూపట్లేదని ఆపార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. 


శ్రీకాకుళం ఎంపీ స్థానానికి సీనియర్ లీడర్ ను  పెట్టాలని జగన్ ప్రయత్నం 


హేమాహేమీలు కూడ ఎంపీగా పార్టీనుంచి బరిలో దిగేందుకు సుముఖత లేకపోవడంతో ఎవర్ని బరిలో దించాలి అనే దానిపై వైసీపీ పెద్దలు చర్చలు జరుపుతున్నారు.  రామ్మోహన్ నాయుడు వరుసగా రెండు పర్యాయల్లో విజయం సాధించిన ఈ  స్థానాన్ని ఎలాగైనా రానున్న ఎన్నికల్లో దక్కించుకోవాలని సీఎం పట్టుదలతో ఉన్నారు. ఈసారి రామ్మోహన్ నాయుడు సామాజిక వర్గంనుంచి బరిలో దించాలని భావించిన వైసీపీ అధిష్టానం అందులో భాగంగా నే ధర్మాన సోదరులలో ఒకరిని బరిలో దించడం వలన ఢీ కొట్టగలమని వైసీపీ హైకమాండ్ భావిస్తున్నారు.  అయినప్పటికీ ఆ సోదరులు ముందుకు రాకపోవడంతో ఏం చేయాలనే దానిపై తర్జన భజన పడుతున్నారట. 


ధర్మాన కృష్ణదాస్ తనయుడ్ని రామ్మోహన్ నాయుడుపై నిలబెట్టాలనే ఆలోచన 


ధర్మాన కృష్ణ దాస్ కుమారుడు డాక్టర్ కృష్ణ చైతన్యను ఎంపీ గాబరిలో దించాలని ఒక ఆలోచన వచ్చిన రామ్మోహన్ నాయుడుపై ఎదుర్కోవడం వారికి సత్తాచాలదని భావిస్తున్నారట. అంతేకాకుండా నరసన్నపేట సెగ్మెంటులోనే  ఇటీవల కుటుంబంపై  పెరిగిన అసంతృప్తితో దిగాలు చెందుతుండగా ఈ ఎంపీ మాకు వద్దు అంటు సీఎంకు చెప్పేశారట.  సీతారాం , కృష్ణ దాస్,  ప్రసాదరావు వారి పిల్లలకు అసెంబ్లీ స్థానాన్ని కట్టబెడితే అప్పుడు  ఎంపీగా వెళ్ళేందుకు ఇష్టపడుతున్నట్టు ఓ ప్రతిపాదనలు సీఎం ముందు ఉంచారన్నట్టు సమాచారం . దీనికి హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు.  అందుచేతనే ఇప్పటివరకు వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థి ఎవరనేది నిర్ణయించుకోలేక పార్లమెంట్ ఇన్చార్జి బాధ్యతలను ఎవరికి కూడా కట్టబట్లేదు. 


వారసుడికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే ఎంపీగా పోటీ 


అధికారంలో ఉండి ఎవర్ని కూడా ఇన్చార్జిగా నియమించకపోవడం పట్ల పార్టీ శ్రేణులే అసంతృప్తి చెందుతున్నారు. ఇటివలే శ్రీకాకుళం నగరం లో గల డాక్టర్ దానేటి శ్రీధర్ బరిలో ఉండాలని భావిస్తున్నా నేతలేవరు  ఆయన పేరును ప్రతిపాదించకపోవడంతో వెనుకముందు అవుతున్నారట.  ఎంపీ రామ్మోహన్ నాయుడు పైన దీటైన అభ్యర్థి జిల్లాలో ఎవరు లేరని యువతతో పాటు రాజకీయ విశ్లేషీకుల నుంచి  గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా  ఎవర్నో ఒకర్ని బాధ్యతలు అప్పగించడం వలన పార్టీ నుంచి ఒకరున్నారని చెప్పుకోవచ్చని  వైసీపీ శ్రేణులు భావిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో లేరని అధికార పార్టీ నేతలు తలలుపట్టుకున్నారట. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో వెలమ, కాళింగ సామాజికవ ర్గం ఒకరికి ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పాల్సిన పార్టీ శ్రేణులనుంచి ప్రతిపాదనలు ఉన్నాయి. అంతా తానై వ్యవహారిస్తు జిల్లాలోనే కాకుండ రాష్ట్రంలో పీకే టీం సర్వే , చెప్పిందే వేదాంతమంటున్న తరుణంలో మరి నియోజకవర్గంలో ఇన్ చార్జ లేకపోవడం వలన జరిగే నష్టాలపై ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారో మరి...