YSRCP News :   మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.. కార్యకర్తలంతా సమష్టిగా పనిచేయాలి.. వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని వైసీపీ ఉత్తరాంధ్ర పరిశీలకుడు, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు.  కంచిలిలో సామాజిక బస్సు యాత్ర సన్నాహక సమావేశం ఇచ్ఛాపురం సమన్వయకర్త పిరియా సాయిరాజు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సుబ్బారెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ జెండా రానున్న ఎన్నికల్లో రెపరెపలాడాలన్నారు.


అవినీతికి తవు లేని సీఎం జగన్ పాలన 


అవినీతికి తావులేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి పారదర్శకంగా పాలన అందిస్తున్నామని చెప్పారు. మేనిఫెస్టోలో ఉన్నవన్నింటినీ అమలు చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీలే కాదు ఇవ్వని హామీలు కూడా ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కోట్లాది మందికి ఏదొక సంక్షేమకార్యక్రమం అందిస్తున్నామని తెలి పారు. 2014 నుంచి 2019 వరకు దోపిడీ ప్రభుత్వం నడిచిందన్నారు. బీసీలంటే బ్లాక్ వర్డ్ కాదని.. బ్యాక్ బోన్ అంటూ ఏలూరులోనే జగన్ చెప్పారని తెలిపారు. మంత్రి పదవులు, ఎమ్మెల్సీలలో కూడా అత్యధికంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు 70 శాతం కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి దక్కుతుందన్నారు. వెనుకబడిన సామాజిక వర్గాలకు ఏం చేశామన్నది తెలియజేసేందుకే సామా జిక న్యాయయాత్రను రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నామని తెలిపారు.


సమ సమాజ స్థాపనకు జగన్ కృషి 


 ఇచ్ఛాపురంలో ఈనెల 26నుంచి వైసీపీ సామాజిక న్యాయ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని బొత్స సత్యనారాయణ ెలిపారు.  సమ సమాజ స్థాపనకు సీఎం జగన్ కృషిచేస్తున్నారని తెలిపారు. దేశంలోని ఏపీలో మాత్రమే సామాజిక న్యాయం జరిగిందన్నారు. ఏలూరు బీసీ డిక్లరేషన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి జగన్ కృషి చేశారని తెలిపారు. బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత జగన్కు దక్కుతుందన్నారు. బీసీలు జగన్ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. చంద్రబాబు తప్పు చేయడం వల్లే రిమాండ్లో ఉన్నారన్నారు. ఇన్నాళ్లు చంద్రబాబు టక్కుటమారా విద్యలతో కేసుకు దొరక్కండా తప్పించుకున్నాడని, స్కిల్కేసులో అవినీతి బయటపడడంతో జైలుకు వెళ్లాడన్నారు. చంద్రబాబు ఆరోగ్యం బావుందా లేదా కుటుంబమే కోర్టును ఆశ్రయించాలని సూచించారు. టీడీపీ, జనసేన నేతలు కొందరు సీఎంను ఏకవచనంతో సంబోదిస్తుండడం, అవాకులు, చవాకులు మాట్లాడడం సరికాదన్నారు.  


వైసీపీ బీసీల పార్టీ 


 వైసీపీ బీసీల పార్టీ సీదిరి అప్పలరాజు తెలిపారు.   చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో బీసీలను అవమానించారన్నారు. తొక్కాతోలు తీస్తామని మత్స్యకారులను, నాయీ బ్రాహ్మణులను దూషించారన్నారు. దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటాడని చంద్రబాబు అనడాన్ని ఎవరూ మరచిపోలేదని తెలిపారు. గిరిజనులకు, మహిళలకు క్యాబినేట్లో చోటు కల్పించలేదన్నారు. బీసీలు జడ్జిలుగా పనికిరారని కేంద్రానికి చంద్రబాబు లెటర్ రాసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. సామాజిక న్యాయ యాత్ర ఇచ్ఛాపురం వైసీపీ అభ్యర్థిగెలుపునకు నాంది పలకాలని మంత్రి సీదిరి అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ఇచ్ఛాపురం  నియోజకవర్గంలో అందరూ ఏకమై ఎమ్మెల్యేను గెలిపించుకోవాలని కోరారు. విజయమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.