Vizianagaram Constituency MLA Winner List 2024: విజయనగరం జిల్లాలో టీడీపీ, జనసేన క్లీన్ స్వీప్ చేశాయి. ఇక్కడ ఒక్క చోటపోటీ చేసిన జనసేన విజయం సాధించగా.... మిగతా అన్ని సీట్లలో సైకిల్ దూసుకెళ్లింది. 
 
నియోజకవర్గం  విజేత 

ఎచ్చెర్ల

ఎన్‌. ఈశ్వరరావు(బీజేపీ)

రాజాం

కొండ్రు మురళి

బొబ్బిలి

ఆర్‌ఎస్‌వీకేకే రంగారావు (బేబి నాయన)

చీపురుపల్లి

కళా వెంకట్రావు

గజపతినగరం

కొండపల్లి శ్రీనివాస్‌

నెల్లిమర్ల

లోకం మాధవి

విజయనగరం

అదితి గజపతిరాజు
 
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న విజయనగరం(Vizianagaram) జిల్లాలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2004 ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకోగా...2009లో జరిగిన ఎన్నికల్లోనూ ఆపార్టీ విజయఢంకా మోగించింది. విజయనగరం మినహా మిగిలినచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం జరిగిన పరిస్థితుల్లో ఏపీ ప్రజలు మరోసారి అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు జై కొట్టారు.
 
2014 తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి మళ్లీ పుంజుకుంది. 5 స్థానాల్లో ఆపార్టీ అభ్యర్థులు గెలుపొందగా....కొత్తగా ఎన్నికల బరిలో దిగిన వైసీపీ(YCP) సైతం రెండు సీట్లు గెలుచుకుని రేసులో తాము ఉన్నామని నిరూపించుకుంది. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్‌పార్టీని విజయనగరం జిల్లా ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు.
 
2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనమే సృష్టించింది. రాష్ట్రమొత్తం జగన్ నామస్మరణతో మారుమోగిపోగా....విజయనగరం జిల్లాలోనూ ఆ ప్రభావం కనిపించింది. మొత్తం జిల్లాను క్లీన్‌స్వీప్ చేస్తూ....అన్ని స్థానాలు గెలుచుకుంది. ఓటమి ఎరుగని అశోక్‌గజపతిరాజు కుటుంబం సైతం ఈ ఎన్నికల్లో ఓటమి రుచి చవిచూశారు. అటు కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన బొత్స సత్యనారాయణ సోదరులు సైతం విజయం సాధించడమేగాక....ఆయన మంత్రిపదవి చేపట్టారు.  అటు లోక్‌సభ సీటు సైతం వైసీపీ ఎగరేసుకుపోయింది.
                                విజయనగరం జిల్లా
 

2009

2014

2019

ఎచ్చెర్ల

కాంగ్రెస్

టీడీపీ

వైసీపీ

రాజాం

కాంగ్రెస్

టీడీపీ

వైసీపీ

బొబ్బిలి

కాంగ్రెస్

వైసీపీ

వైసీపీ

చీపురుపల్లి

కాంగ్రెస్

వైసీపీ

వైసీపీ

గజపతినగరం

కాంగ్రెస్

టీడీపీ

వైసీపీ

నెల్లిమర్ల

కాంగ్రెస్

టీడీపీ

వైసీపీ

విజయనగరం

టీడీపీ

టీడీపీ

వైసీపీ