Vizag Traffic Restrictions:
విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
1) డిసెంబర్ 4న మధ్యాహ్నం 2 గంటల నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా పాస్ కలిగి ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. పాస్ లేని వాహనాలు ఫ్లైఓవర్ క్రింది నుంచి మాత్రమే అనుమతి ఇచ్చారు. వేమన మందిరం జంక్షన్, టైకూన్ జంక్షన్, సిరిపురం, సి.ఆర్ రెడ్డి సర్కిల్ మీదుగా APIIC గ్రౌండ్స్, AU హై స్కూల్, AU కాన్వకేషన్ హాల్ వద్ద వారికి నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాలలో వాహనాలు పార్కింగ్ చేయాలని సూచించారు.
2) నావెల్ కోస్టల్ బ్యాటరీ వైపు నుంచి ఆర్ కే బీచ్ వైపు పాస్ కలిగి ఉన్న వాహనాలను మాత్రమే ఎన్టీఆర్ విగ్రహం మీదుగా APIIC గ్రౌండ్స్, AU హై స్కూల్, AU కాన్వకేషన్ హాల్ వద్ద వారికి నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాలలో వాహనాలు పెట్టాలి.
3) పార్క్ హోటల్ వైపు నుంచి వచ్చు పాస్ కలిగి ఉన్న వాహనాలు అక్కడ నుంచి AU అవుట్ గేటు వైపుగా, సి ఆర్ రెడ్డి, ఆల్ ఇండియా రేడియో జంక్షన్ మీదుగా APIIC గ్రౌండ్స్, AU హై స్కూల్, AU కాన్వకేషన్ హాల్ వద్ద వారికి నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాలలో వాహనాలు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
4) ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి టైకూన్ జంక్షన్, దత్త ఐలాండ్, సిరిపురం, సి ఆర్ రెడ్డి సర్కిల్, అల్ ఇండియా రేడియా, ఆర్ కే బీచ్, ఎన్టీఆర్ స్టేట్యూ, నోవోటెల్, నావల్ కోస్ట్ బ్యాటరీ, ఎ యు కన్వెన్షన్,
ఎ యు హై స్కూల్, పటేల్ జంక్షన్, ఫ్యూషన్ ఫుడ్స్, సర్క్యూట్ హౌస్, నేవీ హౌస్, ప్రదేశాలలో పాస్ కలిగి ఉన్న వాహనాలు మాత్రమే అనుమతించనున్నారు. విశ్వప్రియ గ్రౌండ్, APIIC గ్రౌండ్, AU హై స్కూల్ గ్రౌండ్ మరియు AU కన్వెన్షన్ సెంటర్ లు పాస్ కలిగిన వాహనాలకు కేటాయించారు.
5) పాస్ లేని వాహనాలు పై గ్రౌండ్ లలో అనుమతించరు.
6) ప్రజలు ఫిషింగ్ హార్బర్ వైపు నుంచి వచ్చి తమ వాహనములను నావల్ కాంటీన్ వద్ద రోడ్డు ప్రక్కగా పార్కింగ్ చేసుకొని, నడిచి రావలెను.
7) ప్రజలు జగదాంబ జంక్షన్, కలెక్టర్ ఆఫీస్, జడ్పీ జంక్షన్ మీదుగా వచ్చి AMCOSA వెనుక ఉన్న స్పోర్ట్స్ గ్రౌండ్ లో పార్కింగ్ చేసుకొని, నడిచి NCB లేదా నోవోటెల్ మీదుగా బీచ్ లో ఏర్పాటు చేసిన enclosure లకు చేరాల్సి ఉంటుంది.
8) జగదాంబ జంక్షన్ నుంచి పందిమెట్ట జంక్షన్ వచ్చి, AMCOSA వెనుక గల స్పోర్ట్స్ గ్రౌండ్ లో పార్కింగ్ చేసుకొని, నడిచి NCB లేదా నోవోటెల్ మీదుగా బీచ్ లో ఏర్పాటు చేసిన enclosure లకు చేరాలని సూచించారు.
9) మద్దిలపాలెం, au ఇంజనీరింగ్ కాలేజీ, 3 టౌన్ పీస్, యూనివర్సిటీ లోపల గుండా వచ్చి, au ఫుట్ బాల్ గ్రౌండ్ లో పార్కింగ్ చేసుకుని, నడిచి పార్క్ హోటల్ మీదుగా బీచ్ లో ఏర్పాటు చేసిన enclosure లకు చేరుకోవాలి.
10) కురుపాం జంక్షన్ మీదుగా వచ్చి, MGM గ్రౌండ్ లోను, వుడా పార్క్ లోపల, పార్కింగ్ చేసుకొని నడిచి బీచ్ లో ఏర్పాటు చేసిన enclosure లకు చేరాలన్నారు.
11) DLO జంక్షన్ నుంచి వచ్చు పాస్ లేని వాహనములు తెలుగు తల్లి ఫ్లైఓవర్ పైకి అనుమతించరు.
అలాగే నేవీ డే-2022 వీక్షించడానికి వస్తున్న వారు వారికి నిర్దేశించిన పార్కింగ్స్ ప్రాంతాలలో వాహనాలను నిలుపుకొని, కాలినడకన మధ్యాహ్నం 03:30 లోపు ప్రదర్శన జరిగే ప్రాంతానికి చేరుకోవాలని పోలీసులు కోరారు.
ప్రజలు ఫై సూచనలు పాటించి, పోలీస్ వారికి సహకరించి, డిసెంబర్ 4వ తేదీన, పై సమయములలో బీచ్ రోడ్ లో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు పోలీసులు. విశాఖ నగరంలో జరుగుచున్న ఈ కార్యక్రమమును జయప్రదం చేయాలని నగర వాసులను కోరారు. నేవీ డే వేడుకలు ముగిసిన తరువాత ప్రజలు ఎన్టీఆర్ విగ్రహం, పాండురంగాపురం, అల్ ఇండియా రేడియా, au కన్వెన్షన్, cr reddy జంక్షన్, సిరిపురం జంక్షన్, dutt island, circuit house, నేవీ house వైపు రాకూడదని విశాఖ పోలీసులు సూచించారు.