Vizag police commissioner : విశాఖ పోర్టులోని కంటెయినర్‌లో డ్రగ్స్ కేసుపై పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేపడుతోందని నగర సిపి రవిశంకర్ అన్నారు. శుక్రవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపి రవిశంకర్ మాట్లాడుతూ … విశాఖ పోర్టులోని కంటెయినర్‌లో డ్రగ్స్ కేసుపై పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేపడుతోందని, సిబిఐ డాగ్ స్క్వాడ్ సహకారం కోరితే ఇచ్చామని అన్నారు. తమ వల్ల సోదాలు ఆలస్యమయ్యాయని చెప్పడం సరికాదన్నారు. నగరంలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు. కంటెయినర్ టెర్మినల్ తమ కమిషనరేట్ పరిధిలోకి రాదని చెప్పారు. కస్టమ్స్ ఎస్పీ పిలిస్తే వెళ్లినట్లు వివరించారు. సిబిఐ విధి నిర్వహణకు తమవల్ల ఆటంకం కలగలేదని సిపి స్పష్టం చేశారు.
డాగ్ స్క్వాడ్ కాలని పిలిచారు.. తర్వాత వద్దన్నారు!
వారు డాగ్ స్క్వాడ్ కావాలని అడిగారని.. ఆ తర్వాత డాగ్ స్క్వాడ్ వద్దని చెప్పారన్నారు. కేవలం డాగ్ స్క్వాడ్ కోసమే స్థానిక పోలీసులు వెళ్లారని.. సీబీఐ విన్నపం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారన్నారు. విశాఖ పోర్టు తమ పరిధిలో ఉండదని.. తాము కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పనిచేస్తున్నామన్నారు. విధి నిర్వహణలో తమపై ఎవరూ ఒత్తిడి చేయలేరని.. ఏపీ పోలీసులపై సీబీఐ ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. ఇందులో ఏ రాజకీయపరమైన కోణాలు లేవని.. ఏదైనా నిర్ధారించుకున్న తర్వాతే, మీడియా ప్రచురించాలని కోరుతున్నామని రవిశంకర్ తెలిపారు. ఇదే సమయంలో తమపై ఎలాంటి పొలిటికల్ ఒత్తిడిలేదని స్పష్టం చేశారు.
వైజాగ్ ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేస్తున్నాం !
తమ పరిధిలోలేని ప్రైవేటు పోర్టుకు కస్టమ్స్ అధికారులు పిలిస్తేనే వెళ్లామన్నారు సీపీ. వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాయడం మంచిది కాదని.. కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి వదంతులు సృష్టిస్తున్నారన్నారు. విశాఖ డ్రగ్స్ వ్యవహారాన్ని సీబీఐ చూస్తోందన.. విశాఖ చాలా సేఫ్ సిటి అన్నారు. లోకల్ అధికారుల వల్ల లేటు అయ్యిందని చెప్పడం టెక్నికల్ టెర్మినాలజీ మాత్రమేనని.. తాము ఎన్డీపీఎస్ మీద ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. విశాఖను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేస్తున్నామని.. గత ఐదేళ్ల కాలంలో డ్రగ్స్‌ను కట్టడి చేస్తున్నామన్నారు. గంజా రవాణాను అడ్డుకున్నామన్నారు.
డ్రగ్స్ కేసుపై రాజకీయ దుమారం
డ్రగ్స్ కేసు వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. రెండు రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. సంధ్యా ఎక్స్ పోర్ట్స్ సంస్థ యజమాని వైసీపీ నేత అని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఆయన గతంలో మాట్లాడిన వీడయోను. సోషల్ మీడియాలో వేసిన పోస్టర్లను ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు.. అది టీడీపీకి చెందిన వారిదేనన్నారు. పురందేశ్వరి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం సంచలనంగా మారింది.