Visakha Harbor Fire Accident: విశాఖ ఫిషింగ్ హార్బర్‌ అగ్ని ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అర్ధరాత్రి అక్కడ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా వెల్లడించకపోయినా అక్కడ ప్రమాదంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 


విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఓ యూట్యూబర్ పార్టీ ఇచ్చినట్టు తెలుస్తోంది. స్నేహితులతో మందు తాగినట్టు కూడా తెలుస్తోంది. పార్టీలో గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నట్టు పోలీసులు అంటున్నారు. దీనికి ్గ్ని ప్రమాదానికి ఏమైనా లింక్ ఉందేమో అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. 


పార్టీ చేసుకున్న యూట్యూబర్‌ సహా ఆయన స్నేహితులు పరారీలో ఉన్నారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వారిని విచారిస్తే తప్ప అక్కడ ఏం జరిగిందనేది మాత్రం తెలియదంటున్నారు. అందుకే కేసును వారి కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. 






భద్రతా చర్యలు లేకనే ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాదం
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదానికి భద్రతా లోపమే కారణమంటూ మండిపడ్డారు టీడీపీ రాష్ట్రఅధ్యక్షుడు అచ్చెన్నాయుడు. వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం నిర్లక్షయం కారణంగా కార్మికులు, మత్య్సకారులు ప్రమాదంలో పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా విశాఖలో వివిధ పరిశ్రమల్లో ప్రమాదం జరిగాయని అయినా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదని విమర్శించారు అచ్చెన్న. 


సీఎం జగన్‌కు రిషికొండపై ఉన్న శ్రద్ధ ప్రజల భద్రతపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్న. హార్బర్‌లో జరిగిన ప్రమాదంలో జరిగిన నష్టానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు కొత్త బోట్లు అందించాలన్నారు. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.