CBI found No drugs in the container seized at Vizag port: ఈ ఏడాది మార్చిలో విశాఖ పోర్టుకు వచ్చిన ఓ షిప్‌లో డ్రై ఈస్ట్ పేరుతో పెద్ద ఎత్తున కోకైన్ వచ్చిందని దాని విలువ వేల కోట్లు ఉంటుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ కేసులో అసలు డ్రగ్స్ లేవని తాజాగా స్పష్టత వచ్చింది. వైజాగ్ పోర్టు డ్రగ్స్ కేసులో ముగిసిన సీబీఐ విచారణ ముగిసిందని. కంటైనర్ షిప్‌లో ఎటువంటి డ్రగ్స్ లేవని నిర్దారణ అయిందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది 25 వేల టన్నుల డ్రై ఈస్ట్ అని కోర్టుకు సీబీఐ అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది.
గత మార్చిలో బ్రెజిల్ నుంచి విశాఖ సీ పోర్టుకు వచ్చిన ఓ భారీ నౌకలో డ్రగ్స్ ను పట్టుకున్నట్లుగా సీబీఐ ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ ముఠాల్ని పట్టుకోవడానికి, డ్రగ్స్ స్మగ్లింగ్ కుట్రలను చేధించడానికి ఆపరేషన్ గరుడ ను సీబీఐ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నిఘా పెట్టినప్పుడు విశాఖ పోర్టుకు పెద్ద ఎత్తున డ్రగ్స్ పంపిస్తున్నట్లుగా సమాచారం తెలిసింది. దీంతో నిఘా పెట్టిన సీబీఐ అధికారులు షిప్ వైజాగ్ పోర్టుకు రాగానే పట్టుకున్నామని ప్రకటించారు. బీర్‌ను తయారు చేయడానికి ఉపయోగించే కొన్ని రకాల గింజలను డ్రై ఈస్ట్ గా దిగుమతి చేసినట్లుగా పత్రాలు సృష్టించారని.. ఒక్కో బ్యాగులో ఇరవై ఐదు కేజీల చొప్పున మొత్తం వెయ్యి బ్యాగుల్లో ఇరవై ఐదు వేల కేజీల సరుకును పంపినట్లుగా గుర్తించారు.
Also Read: బంగ్లాదేశ్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం - అందరూ మాట్లాడాల్సిన సమయం వచ్చిందని పిలుపు
మొత్తం కన్ సైన్ మెంట్ ను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. అయితే పరీక్షల్లో అది డ్రై ఈస్ట్ గానే నిర్దారించినట్లుగా తెలుస్తోంది. సరుకును తెప్పించుకున్న వారిపైనా.. ఈ స్మగ్లింగ్ లో భాగం అయి గుర్తు తెలియని వ్యక్తులపైనా కేసులు పెట్టారు. ఇతర పదార్థాలతో కలిసి ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తూ.. ఈ అంతర్జాతీయ ముఠా ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తోందని అనుమానించారు. అప్పుడే కంటెయినర్ ను సీజ్ చేసి అన్ని రకాల పరీక్షలను నిర్వహించారు. కానీ ప్రయోజం లేకపోయింది. అందులో కొకైన్ లేదని.. అంతా డ్రైఈస్ట్ అనే అనుకున్నారు.
Also Read: Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?