Union Minister Sarbananda Sonowal In Visakha:
ప్రధాని మోదీ నేతృత్వంలో 9 ఏళ్లలో దేశంలో అభివృద్ధి సాధించాం.. సాగర మాల ప్రాజెక్ట్, పోర్ట్ కనెక్టవిటీ, కోస్టల్ కమ్యూనిటీ, కోస్టల్ డెవలప్మెంట్, షిపింగ్ మీద దృష్టి పెట్టామన్నారు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్. విశాఖ పోర్ట్, డిసిఐ, మారి టైం యూనివర్సిటీ, వివిధ ప్రాజెక్టులపై విశాఖ లో సమీక్ష నిర్వహించారు. విశాఖలో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 802 సాగర మాల ప్రాజెక్ట్ 5.6 లక్షల కోట్లు తో చేపట్టాం, పోర్టులు, మారిటైం బోర్డు ద్వారా ఈ అభివృద్ధి నిర్దేశించాం అన్నారు.
ఒక్క ఏపీలోని 113 ప్రాజెక్టులకు 1.23 లక్షల కోట్లు కార్యకలాపాలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో ఇప్పటికే 36 ప్రాజెక్టులు పూర్తి కాగా, వీటి విలువ 32,210 కోట్లు అన్నారు. సాగర మాల ప్రాజెక్ట్ లో భాగంగా విశాఖ పోర్ట్ ఆధునికరణలో భాగంగా ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కోస్టల్ క్రూయిజ్ అభివృద్ధి చేస్తాం. జాతీయ, అంతర్జాతీయ క్రూయిజ్ కార్యకలాపాలకు అనుకులంగా ఉంటుందన్నారు.
విశాఖ నుంచి చెన్నై, విశాఖ కలకత్తా, విశాఖ- ముంబయి గోవాకు, విశాఖ - కాండ్ల విహార యాత్ర, ప్రయాణ అవకాశాలు వస్తాయని, ద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. వీటితో పాటు ఆయిల్ బాట్, ట్రక్ పార్కింగ్ టెర్మినల్ ను ప్రారంభించనున్నారు. కాలుష్య రహిత నగరంగా విశాఖను తీర్చి దిద్దుతాం. కార్గో ట్రాన్స్ పోర్ట్ విస్తరిస్తున్నాము. వైజాగ్ పోర్ట్ సాంకేతిక ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి చేశామన్నారు.
విశాఖ పోర్ట్ ను మోడరనైజేషన్ మెకనైజాషన్ అభివృద్ధి పరుస్తాం. విశాఖ నుంచి 2030 నాటికి 1 మిలియన్ కంటైనర్లు రవాణా లక్ష్యం నిర్దేశించుకున్నట్లు కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. విశాఖ పోర్ట్ అభివృద్ధి స్థానిక ప్రజల సహకారంతో సాధ్యం అవుతోంది. విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిదుతామని చెప్పారు.
విశాఖ సిగలో మరో మణిహారం
సముద్ర విహారంపై ఆసక్తి చూపే పర్యాటకుల కోసం విశాఖ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ ముస్తాబైంది. దేశ విదేశాల పర్యాటకులు క్రూయిజ్‌లో వచ్చి విశాఖ నగరంలో పర్యటించేలా ఈ టెర్మినల్‌లో వివిధ ఏర్పాట్లు చేశారు. పోర్టులోని గ్రీన్ చానల్ బెర్త్‌లో రూ.96.05 కోట్లతో ఈ సముద్ర విహార కేంద్రాన్ని నిర్మించారు. ఇందుకోసం కేంద్ర టూరిజం శాఖ 38.50 కోట్ల రూపాయలు కేటాయించింది. క్రూయిజ్ షిప్స్‌తోపాటు భారీ కార్గో నౌకల హ్యాండ్లింగ్‌కు అనుగుణంగా క్రూయిజ్ టెర్మినల్‌ను తీర్చిదిద్దారు. సోమవారం కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభించనున్నారు.
ఏపీ పర్యాటక రంగానికి ఊతం
భారత్‌లో క్రూయిజ్ టూరిజానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ టెర్మినల్ నిర్వహణలో ఏపీ టూరిజం, కేంద్ర టూరిజం శాఖలతో కలిసి విశాఖపట్నం పోర్టు పని చేయనుంది. ప్రస్తుతం 7.1 యూఎస్ బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది. రానున్న పదేళ్లలో 12.1 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా క్రూయిజ్ రంగం 1.17 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పర్యాటక రంగం వృద్ధి చెందటంతో పాటు ఉద్యోగ కల్పన కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.