Agnipath Protests In Hyderabad: సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిపథ్ నిరసనలు, అల్లర్ల ఘటనతో కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా వైజాగ్ రైల్వే స్టేషన్ ను మూసివేశారు. శనివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ రైల్వే స్టేషన్ లోకి ఎవరినీ అనుమతించరు. సికింద్రాబాద్ అల్లర్ల నేపథ్యంలో రైల్వే అధికారులు, పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సింహాచలం, మర్రిపాలెం, గుంటూరు లాంటి స్టేషన్లలోనూ భద్రతను పెంచారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా విశాఖ పట్నంలో కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ప్రభుత్వం, రైల్వే శాఖ అలెర్ట్ అయ్యాయి. వైజాగ్ సీపీ శ్రీకాంత్, వాల్తేర్ డివిజన్ DRM అనూప్ సత్పతీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు .
విశాఖ పరిధిలోని 12 రైళ్లు రద్దు
1)ట్రైన్ నెం . 08522 విశాఖ పట్నం - గుణుపూర్, ట్రైన్ నెం . 08521 గుణుపూర్ - విశాఖపట్నం
2) 18551 విశాఖపట్నం - కిరండోల్, 18552 కిరండోల్ - విశాఖపట్నం
3)17240 విశాఖపట్నం - గుంటూరు (సింహాద్రి ), 17239 గుంటూరు - విశాఖపట్నం (సింహాద్రి )
4) 12807 విశాఖపట్నం - నిజాముద్దీన్ -(సమత ), 12808 నిజాముద్దీన్ - విశాఖపట్నం (సమత ఎక్స్ ప్రెస్, 20. 6. 2022 )
5)17016 సికింద్రాబాద్ - భువనేశ్వర్ (విశాఖ ) ( శుక్రవారమే రద్దు అయింది ), 17015 భువనేశ్వర్ -సికింద్రాబాద్ (విశాఖ ) (శనివారం రద్దు )
6)22819- భువనేశ్వర్ - విశాఖపట్నం -(ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్), 22820 విశాఖపట్నం -భువనేశ్వర్ -(ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్)
ఈ రైళ్లు శనివారం నాడు రద్దయ్యాయి.
దువ్వాడలో ఆగిపోయే రైళ్లు ఇవే..
1)ట్రైన్ నెంబర్ - 12728 - గోదావరి
2) 12862 - కాచిగూడ - విశాఖపట్నం
3) 12740 -సికింద్రాబాద్ - వైజాగ్ - గరీబ్ రథ్
4) 18520 - LTT - విశాఖపట్నం
5) 17487- కడప - విశాఖపట్భం - తిరుమల రైళ్లు దువ్వాడ వద్దే ఆగిపోనున్నాయి.
అలాగే , 1) ట్రైన్ నెం . 18517- కోర్బా - విశాఖపట్నం
2) 22873- దీఘ - వైజాగ్ ఎక్స్ ప్రెస్ రైళ్లు కొత్తవలస వద్దే నిలిచిపోనున్నాయి
అనకాపల్లి వద్ద ఆగిపోయే రైళ్లు :
1) ట్రైన్ నెంబర్ 17219 మచిలీపట్నం - వైజాగ్
2)17267- కాకినాడ -విశాఖపట్నం
3) 22708 తిరుపతి - విశాఖపట్నం -డబుల్ డెకర్ ట్రైన్
ఇవన్నీ అనకాపల్లి స్టేషన్ వద్దే నిలిపివేయనున్నారు. కనుక ఈ మూడు రైళ్లు మళ్లీ అనకాపల్లి నుండే శనివారం నాడు తిరిగి బయలుదేరనున్నాయి.
దారిమళ్లించిన రైళ్లు
1) ట్రైన్ నెంబర్ 22807- సత్రాగచ్చి -MGR చెన్నై సెంట్రల్ ఎక్స్ ప్రెస్
2) 12840 - చెన్నై - హౌరా- మెయిల్
3)13351 - ధన్ బాద్ - అలెప్పీ -బొకారో ఎక్స్ ప్రెస్
4)18048 - వాస్కో -డా - గామా -హౌరా
5)12889 - టాటా - యశ్వంత పూర్ -వీక్లీ ఎక్స్ ప్రెస్
6)17243 - గుంటూరు - రాయగడ - ఎక్స్ ప్రెస్
7)12664 - తిరుచురాపల్లి -హోరా - వీక్లి ఎక్స్ ప్రెస్
8)18464 -బెంగుళూరు - భువనేశ్వర్ - ప్రశాంతి ఎక్స్ ప్రెస్ రైళ్లను దువ్వాడ మీదుగా దారి మళ్లించారు. ఇవి వైజాగ్ స్టేషన్ లోకి ప్రవేశించవు.