విశాఖలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని ఎన్‌ఏడీ జంక్షన్‌ వద్ద ఈ నగదు పోలీసులకు దొరికింది. విశాఖ ఎయిర్‌పోర్టు పోలీసులు ఈ నగదు స్వాధీనం చేసుకున్నారు. వాషింగ్‌ మెషిన్‌లో కరెన్సీ నోట్ల కట్టలను ఉంచి ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు. 1.30 కోట్ల రూపాయల నగదుతోపాటు 30 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడం, లెక్కలు చెప్పకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఆర్‌పీసీ సెక్షన్ 41, 102 కింద నమోదు చేసి విచారణ చేపట్టారు. నగదును విజయవాడ తరలించారు.