Visakha News: విశాఖపట్నంలో అక్టోబర్ ఒకటవ తేదీన నారీ శక్తి సమ్మేళనం నిర్వహిస్తామని నారీ యోజన సంస్థఅధినేత ధరణి ప్రియ తెలిపారు. గురుద్వారా వద్ద గల స్మార్ట్ ఇన్ హోటల్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సంస్థలో ఉన్న మొత్తం 30 మంది సభ్యులు కలిసి ఈ కార్యక్రమం తలపెట్టినట్లు చెప్పారు. అలాగే చంద్రయాన్ విజయవంతంలో మహిళలు కూడా కీలక పాత్ర పోషించారు అని గుర్తు చేశారు. సమాజ అభివృద్ధి,  వికాసం కోసం మహిళల పాత్ర పెంచడమే నారీ యోజన ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళల సమస్యలు తెలుసుకొని పరిష్కారిస్తామని వివరించారు. అలాగే 90 ఏళ్ల ప్రొఫెసర్ శాంతమ్మ, తదితరులకు సన్మానం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వెయ్యి మంది మహిళలు పాల్గొంటారు అని ధరణి ప్రియ తెలిపారు.


విశాఖ, అనకాపల్లి జిల్లాల నుంచి విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పుకొచ్చారు. మహిళా సురక్ష కార్యక్రమం, బృంద చర్చ కూడా ఉంటుందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థినులను కూడా చైతన్య పరిచే విధంగా పోటీలు ఉంటాయన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ సద్వినియోగం అవుతుందిని సంతోషం వ్యక్తం చేశారు. యువతకు ప్రోత్సాహం కల్పించడం కూడా ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమం పోతిన మల్లయ్య పాలెం  వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు జరుగుతుందని ధరణి ప్రియ వివరించారు. మీడియా సమావేశంలో సంస్థ కో -  కో ఆర్డినేటర్ ఉమాదేవి, సమన్వయ కర్త వెంకట భాను కూడా పాల్గొన్నారు.


Read Also: YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి, కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్