Resurfacing Works Completed In Vizag Airport: విశాఖ ఎయిర్ పోర్టులో రన్ వే రీ సర్ఫేసింగ్ పనులు పూర్తయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి 24 గంటలు ఎయిర్ పోర్టులో విమాన రాకపోకలకు అనుమతి ఇచ్చారు. రీ సర్పేసింగ్ పనుల కారణంగా రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకూ రన్ వే మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు.  అనుకున్న సమయాని కంటే ముందుగానే పనులు పూర్తి చేసింది నేవీ. ఏప్రిల్ 1 నుంచి విశాఖ నుంచి విమాన సర్వీసులు పెరగనున్నాయి. దాంతో అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఆటంకం తొలగిపోయాయి. నేవీ అధికారులు నవంబర్ నెలలో విశాఖ ఎయిర్ పోర్ట్ రీ సర్ఫేసింగ్ పనులు చేపట్టి, తక్కువ సమయంలోనే పూర్తి చేసింది.