APMS Inter Admissions: ఆంధ్రప్రదేశ్‌లోని ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ప్రవేశ ప్రక్రియకు సంబంధించి మార్చి 28 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. పతోతరగతి అర్హత ఉన్న విద్యార్థుల నుంచి మార్చి 28 నుంచి మే 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రస్తుతం పదోతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పదోతరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు. విద్యార్థులు నిర్ణీత తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కింద ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 200. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చె.ల్లించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 163 మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాల ద్వారా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్‌లలో ప్రవేశాలు కల్పి,స్తారు. ఇందులో సీట్లు పొందినవారికి ఉచిత విద్య అందిస్తారు. ఈ ఆదర్శ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ విద్య బోధిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఈఏపీసెట్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. వీటిలో విద్యనభ్యసించేందుకు ఎలాంటి ఫీజులు చెల్లించనవసరం లేదు.
వివరాలు..
* ఏపీ ఆదర్శపాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలు
పాఠశాలల సంఖ్య: 163.
గ్రూపులు..
➥ ఎంపీసీ
➥ బైపీసీ
➥ ఎంఈసీ
➥ సీఈసీ
అర్హతలు: సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 200. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
ఎంపిక విధానం: 10వ తరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ హెడ్ ఆఫీసర్ ద్వారా నోటిఫికేషన్ వెల్లడి: 26.03.2024.
➥ రిజిస్ట్రేషన్ ఫీజు ప్రక్రియ ప్రారంభం: 27.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.05.2024.
➥ దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జాబితా వెల్లడి: 23.05.2024.
➥ మెరిట్ జాబితా వెల్లడి (సంబంధిత ప్రిన్సిపల్స్ ద్వారా): 24.05.2024.
➥ మెరిట్ జాబితా వెల్లడి (డీఈవో ద్వారా): 25.05.2024.
➥ సర్టిఫికేట్ వెరిఫికేషన్: 27.05.2024.
➥ తరగతులు ప్రారంభం: 01.06.2024.
ALSO READ:
6వ తరగతి దరఖాస్తుకు మార్చి 31 వరకు అవకాశం..
ఏపీలోని 164 ఆదర్శ పాఠశాలల్లో (Mode Schools) ఆరో తరగతిలో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 1న వెలువడిన సంగతి తెలిసిందే. విద్యార్థులు మార్చి 1 నుండే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమూంది. మార్చి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 21న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే 5వ తరగతి స్థాయి సిలబస్‌తో తెలుగు/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..