Vizag Lands Scam : ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఉన్న రూ.2 లక్షల కోట్ల విలువగల క్రిస్టియన్ మైనారిటీ స్థలాలను వైఎస్ఆర్‌సీపీ నేతలు కాజేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. టిడిపి విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షులు ఉరికూటి డేవిడ్ పలు పత్రాలను మీడియా ముందు తీవ్రమైన ఆరోపణలు చేశారు. సిరిపురం, టైకూన్ హోటల్ సమీపంలోని రూ.500 కోట్లు విలువగల సి బి సి ఎన్ సి స్థలాన్ని ఎంపీ ఎంవీవి సత్యనారాయణ, వైజాగ్ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ జివి కలిసి కాజేస్తున్నారని, దీని వెనక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసిపి కీలక నేత ఉన్నారని ఆరోపించారు. ఈ స్థలం సర్వేనెంబర్ 75 లో ఉందని, సుమారు 1900 గజాల మేరకు ఉంటుందని ఆయన వివరించారు. 18 క్రిస్టియన్ సంస్థలకు ఈ స్థలం అప్పట్లో దారా దత్తం చేయడం జరిగిందని, ఈ వివాదం కోర్టులో ఉందని ఊరికూటి డేవిడ్ తెలిపారు.
విశాఖ ఎంపీ క్రిస్టియన్ సంస్థల ఆస్తుల కబ్జా చేస్తున్నారు !
సిరిపురం లో సర్వే నెంబర్ 75 లో 19 వేల గజాల స్థలం 500 కోట్ల విలువ చేసే సీ బీ సీ ఎన్ సి భూమి కబ్జా కు గురైంది.విశాఖపట్నం ఎంపీ M V V సత్యనారాయణ, జగన్ మరియు సాయి రెడ్డి వీటికి సూత్రధారులన్నారు. కుర్మాన పాలెం లో 14.1 ఎకరాల క్రిస్టియన్ మిషనరీ భూమిని ఎంపీ MVV సత్యనారాయణ బెదిరించి దోచి దానిపై LIC హౌసింగ్ నుండి 125 కోట్లు ఋణం తీసుకొనిmvv హోసింగ్ సంస్థ పేరట నిర్మాణం చేస్తున్నారన్నారు. ఈ స్థలాల జోలికి వెళ్లొద్దని కోర్టు మొట్టికాయలు పెట్టినప్పటికీ ఎంవివి సత్యనారాయణ ఆగడం లేదని ఆయన మండిపడ్డారు. ఇలాగే విజయనగరం క్రిస్టియన్ మిషనరీకి చెందిన దువ్వాడలోని 15 ఎకరాల భూమిని ఎంపీ సత్యనారాయణ కబ్జా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
బినామీ పేర్లతో సి బి సి ఎన్ సి సంస్థ భూములు స్వాహా
దశాబ్దాల క్రితమే లండన్‌లోని CBCNC ద్వారా ఈ సంస్థ మన రాష్ట్రం లో పెట్టారని.. ఈ సంస్థ ద్వారా వచ్చిన నిధులు నుండి అప్పట్లో ఈ స్థలాలు కొనడం జరిగినదన్నారు. తర్వాత కాలంలో సి బి సి ఎన్ సి సంస్థ ద్వారా రావలసినటువంటి నిధులు ఆగిపోయాయని.. అయితే భూమి విలువలు నానాటికి పెరగడంతో భూ కబ్జాదారుల దృష్టి సిబిసిఎన్సి సంస్థల భూములపై పడిందన్నారు. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది బినామీల పేరిట సంస్థ యొక్క భూములను తమవని రాయించుకుని చట్టాల లోని లోసుగులను ఆధారంగా చేసుకుని యు ఎల్ సి అర్బన్ ల్యాండ్ సీలింగ్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర రెవెన్యూ కి లాభం చేకూరుతుంది అని మాయతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు 18 ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడానికి ప్రయత్నాలు చేశారని.. . వీటిపై హైకోర్టు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిందన్నారు.
దేవుని బిడ్డ జగన్ .. జీసస్ ఆస్తులను కాపాడరా ?
దేవుని బిడ్డగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దేవుని ఆస్తులను కాపాడాల్సింది పోయి, తన అనుయాయులకు కట్టబెడుతున్నారని ఆయన తెలిపారు. వెంటనే వీటిపై సర్వే చేసి క్రిస్టియన్ ఆస్తులను కాపాడి, బినామీ పేరుతో కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో క్రైస్తవ మిషనరీస్ ఆస్తుల పరిరక్షణకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద క్రైస్తవులంతా కలిసి రిలే నిరాహార దీక్షలు చేపడతారని ఆయన ప్రభుత్వానికి హెచ్చరించారు.కాకినాడ నుండి శ్రీకాకుళం వరకు సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే కృష్టియన్ మిషనరీ భూములకు రక్షణ లేదని క్రిస్టియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.