TDP leader Buddha Venkanna: ’A 1 జగన్ మోహన్ రెడ్డి, A 2 విజయ సాయిరెడ్డి ఢిల్లీకి వెళ్లారని.. కానీ ఎందుకు వెళ్లారో చెప్పరు. ప్రధాని కలిసిన తర్వాత ఎందుకు కలిసామో ప్రజలకు ముఖ్యమంత్రి చెప్పాలి. కానీ జగన్ అది చెయ్యరు’ అని టీడీపీ నేత బుద్దా వెంకన్న సెటైర్లు వేశారు. ఎంతసేపూ తనపై ఉన్న కేసులు ఎప్పుడు ఎత్తేస్తారా.. ఎప్పుడు ప్రధాని మోదీ కి సాష్టాంగ నమస్కారాలు చేద్దామా అనే ధ్యాస తప్ప ప్రజలకోసం మాట్లాడిన దాఖలాలు లేవు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధీనం లోని రోడ్లన్నీ దారుణం గా తయారయ్యాయని, టీడీపీ హయాంలో వేసిన రోడ్లు తప్ప. జగన్ ప్రభుత్వం వేసిన రోడ్డు రాష్ట్రం లో ఒక్కటన్నా బాగుందా?? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులను ఈ విషయపై ఛాలెంజ్ చేశారు. టీడీపీ కట్టిన ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకుంటుందని, ప్రజల సొమ్ము తాడేపల్లి ఆఫీస్ కు వెళ్ళిపోతోందని ఆరోపించారు.
ఓన్లీ డైరెక్ట్ క్యాష్ తో మాత్రమే మద్యం వ్యాపారం చేసే ప్రభుత్వం వైసీపీ దేనని, ఎందుకు UPI పెమెంట్స్ అంగీకరించరు? అని ప్రశ్నించారు. ఎందుకంటే ఆ లిక్విడ్ క్యాష్ అంతా తాడేపల్లి ప్యాలెస్ కీ.. ఇడుపుల పాయకీ వెళుతోందని ఆరోపించారు. కేంద్రం దీనిపై సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలి. సీఎఖం జగన్ కు భూ దాహం.. ధన దాహం ఎక్కువ అని, కనుక జగన్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. ముందస్తు వచ్చినా.. రాకున్నా, ఎన్నికలకు టీడీపీ ఎప్పుడూ సిద్ధమే అన్నారు బుద్దా వెంకన్న.
ఉమ్మడి విశాఖ జిల్లాలో 1000కి పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయని, అక్కడ వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఇటీవల సాహితీ ఫార్మాలో మృతుల కుటుంబాలకు 25లక్షల చొప్పున మాత్రమే పరిహారం ఇచ్చారని, అంతకు ముందు LG పాలిమర్స్ లో మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం చెల్లించారని గుర్తుచేశారు. సాహితీ ఘటన లో మృతులకు కూడా అధిక పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ కంపెనీని కాజెయ్యడానికి కూడా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో ఫార్మా కంపెనీల నుంచి అధిక మొత్తంలో ఫండ్ ను విజయ సాయిరెడ్డి పోగు చేశారని వ్యాఖ్యానించారు. అందుకే ఫార్మా కంపెనీ ల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్నది పట్టించుకోవడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు బుద్దా వెంకన్న. అధికారులు తమ బాధ్యత నిర్వర్తించకుండా వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. సాహితీ ఫార్మా ఘటన లో మృతులకు అందాల్సిన కోటి రూపాయల నష్ట పరిహారంలో 75 లక్షల చొప్పున అక్కడి మంత్రి, ఇతరులు కలిసి కాజేసి కేవలం 25 లక్షలు మాత్రమే ప్రకటించారని ఆరోపించారు. ఈ ప్రమాదాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. మంత్రి అమర్నాథ్ అనకాపల్లి ఫార్మా కంపెనీల ప్రమాదాల పై ఎందుకు మాట్లాడడం లేదు. పేద వాళ్ల శవాలపై పైసలు వైసీపీ నాయకులు ఏరుకుంటున్నారంటూ మండిపడ్డారు.