విశాఖ భూములపై టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ మధ్య  ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. భూముల విషయంలో టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను టీడీపీ ఖండించింది. వైఎస్ఆర్‌సీపీ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని.. ఇప్పుడు కూడా చేస్తోందని టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. విశాఖలో మీడియా సమావేశం నిర్వహించి పలు విషయాలు వెల్లడించారు. విజయసాయిరెడ్డి ఆడిటర్ అనతి.. టెక్నీకల్ గా అన్ని తెలుసి కూడా అబ్దదాలు ఆడుతున్నారని.. తాను  మరోసారి చాలంజ్ చేస్తున్నానని 2019లో మార్కెట్ వాల్యూకి 20శాతం ఎక్కువ రేటు ప్రకారం ఇస్తామని చంద్రబాబు జీవో ఇచ్చారని ఆ విషయం రుజువు చేస్తానన్నారు.  64 జీవో గురుంచి విజయసాయిరెడ్డి ఎందుకు చెప్పలేదని..  చెప్పే దమ్ము లేదా అని ప్రశ్నించారు.  


నలుగురితో  వేసిన కమిటీ ఇచ్చిన లెక్క ప్రకారం భూములను రూ. వెయ్యి కోట్లకు ఇవ్వాలని.. కానీ రూ. 187 కోట్లకు అప్పనంగా ఇచ్చేశారని మండిపడ్డారు. జీఆర్పీఎల్ కంపెనీ  వాళ్ళు గజం 50 వేలు చొప్పున అమ్మారని గుర్తు చేశారు. ఆ కంపెనీ యజమానికి కొట్టు మురళి గంటా శ్రీనివాసరావుకు స్నేహితుడు అంటున్నారని.. కానీ అదే కొట్టు మురళి మీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సోదరుడనే సంగతి ఎందుకు చెప్పలేదని బండారు సత్యనారాయణ ప్రశ్నించారు. కొట్టు మురళి శ్రీరామ ప్రాపర్టీస్ రెండెకరాల స్థలంలో  విజయసాయిరెడ్డి పాగా వేశారని... అక్కడ ఎందుకున్నారని ప్రశ్నించారు. 


విశాఖ నుంచి అదాని, లూలు వంటి సంస్థలను వెళ్లగొట్టారని మండిపడ్డారు. చంద్రబాబుకు దగ్గర అని ఆరోపిస్తున్న ఎన్‌సీసీ కపెనీకి భూములు ఎందుకిచ్చారని బండారు ప్రశ్నించారు.  
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, అనేక  వాటికి బాధ్యతలు చేపట్టాననని..మచ్చలేకుండా రాజకీయం చేశానని బండారు స్పష్టం చేశారు. ముదపాక భూ వ్యవహారంలో మాపై లేనిపోని ఆరోపణలు చేసి మూడేళ్లయింది.. ఎందుకు నిరూపించలేకపోయావని బండారు విజయసాయిరెడ్డిని ప్రశ్నిచారు. సిట్ వేసికూడా ఎందుకు నివేదికను దాచి పెట్టారనిప్రశ్నించారు. పదహారు నెలల పాటు జైల్లో ఉన్న జగన్, విజయసాయి లాంటి చరిత్ర మాకెవరికీ లేదని..  మీ బాగోతం ప్రజలందరికీ తెలుసన్నారు. 


విశాఖ భూముల జీవోలతో తిరుపతి వెంకన్న దగ్గరకురా... ప్రమాణం చేద్దామని సవాల్ చేసారు. నువ్వు చేసిన అక్రమాలు బయటపెడితే మా అంతు చూస్తావా అని మండిపడ్డారు. చంద్రబాబు చిరకాలం జీవిస్తాడు, సంపూర్ణ ఆరోగ్యవంతుడని..  విజయసాయిరెడ్డి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.  మీరు జైలకువెళ్తే చంద్రబాబు సీఎం హోదాలో ముద్ద వేస్తారన్నారు.