Ayyanna On Vijaysai :    దోపిడీతో రాష్ట్రానికి యువతకు భవిష్యత్ లేకుండా చేసిన జగన్ రెడ్డి వినాశకర పాలన తో ఎంతో పేరు ప్రఖ్యాతులు, విలువైన ఖనిజసంపద, ప్రకృతి వనరులన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూశాక కూడా మేథావులు, విజ్ఞులు, ప్రజా సంఘాలు, ప్రజలు స్పందించకపోతే ఎలాగని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. విశాఖలో తర్లువాడ కొండకు విజయసాయిరెడ్డి కుమర్తెకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలియడంతో ఆయన అమరావతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసితీవ్ర ఆరోపణలు చేశారు. 


తర్లువాడ కొండను కేటాయించాలని విజయసాయిరెడ్డి కుమార్తె దరఖాస్తు 


గత ప్రభుత్వాల్లో సమర్థవంతంగా పనిచేసిన అనేకమంది ఐ.ఏ.ఎస్, ఐ.పీ.ఎస్ అధికా రులు జగన్ రెడ్డి విధానాలను, ప్రభుత్వదోపిడీని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని ప్రశ్నిచారు.  రాష్ట్రంలో జరిగే దోపిడీపై ప్రజలందరూ గట్టిగా పాలకుల్ని నిలదీయాల్సిన సమయం వచ్చిందన్నారు.   విశాఖపట్నంలో ఏ2 విజయసాయిరెడ్డికి, భీమునిపట్నం ప్రాంతంలో రూ.300 కోట్ల విలువైన తుర్లవాడ కొండ భూమిని కట్టబెట్టేందుకు జగన్ ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. తుర్లవాడ కొండ ఆ ప్రాంతంలో ఎంతో పవిత్రమైనది.. విశేషమైనది. ఆ కొండపై దేవుని పాదాలు ఉన్నాయని అక్కడి ప్రజలు విశ్వసిస్తుంటారు. అలాంటి కొండను కబ్జా చేయడానికి విజయసాయిరెడ్డి అతని గ్యాంగ్ సిద్ధమైంది. రెండ్రోజుల క్రితం ఏ2 కొండను పరిశీలించడానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజలకు అనుమానం వచ్చింది. ఆ తరువాత ప్రభుత్వ సహాయసహకారంతో ఏ2 ఆ కొండను కబ్జా చేయడానికి సిద్ధమ య్యాడని అర్థమైంది. ఆ కొండపైన విజయసాయిరెడ్డి కూతురు ప్రైవేట్ యూనివర్శిటీ కడుతుందని, కాబట్టి దానిపై 120ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. సదరు దరఖాస్తుపై అధికారయంత్రాంగం ఆఘమేఘాలపై స్పందించి, చకచకా ఫైల్ సిద్ధంచేసి, ముఖ్యమంత్రి ఎదుట ఉంచింది.


ఎక్కడ మిగిలి ఉంటే అక్కడ భూముల్ని కాజేస్తున్నారు ! 


రూ.300కోట్ల విలువైన కొండభూమిని రూ.20కోట్లకే ఏ2 కట్టబెట్టడానికి జగన్ రెడ్డి సిద్ధమయ్యాడని అయ్యన్న ఆరోపించారు.  విశాఖపట్నం సమీపంలో ఉన్న ఆ కొండ భూమి ఎకరం ధర రూ.2 నుంచి రూ.3 కోట్లు ఉంటుంది. 120 ఎకరాలు రూ.300 కోట్లవరకు విలువ ఉంటే, కేవలం రూ.20కోట్ల నామమాత్రపు ధరకే జగన్ రెడ్డి దాన్ని ఏ2కు కట్టబెట్టడానికి సిద్ధమయ్యాడు. నాలుగున్నరేళ్ల నుంచి రాష్ట్రంలో ఎక్కడా, దేన్ని వదలకుండా దోచుకున్న జగన్ రెడ్డి, అతని అనుమాయులు ఇంకా అక్కడక్కడ మిగి లిన ఇలాంటి విలువైన భూముల్ని కూడా కాజేసేందుకు సిద్ధమయ్యారు. తుర్లవాడ కొండపై నరసింహస్వామి నడయాడా రని అక్కడి ప్రజలు విశ్వసిస్తుంటారు. ఆ కొండపై నరసింహస్వామి విగ్రహ ఏర్పాటుకు గతంలోనే స్థానికులు టీటీడీ వారితో మాట్లాడారు. అటువంటి పవిత్రమైన కొండను ఏ2కు ధారాధత్తం చేయడానికి సిద్ధపడిన జగన్ రెడ్డికి సిగ్గుందా అని ప్రశ్నించారు. 


విశాఖ ఆస్తులు తాకట్టు పెట్టి రూ. పాతిక వేల కోట్ల పెట్టి అప్పు


విశాఖపట్నంలో విజయసాయి, జగన్ రెడ్డి ఇప్పటికే వేల ఎకరాల ప్రభుత్వభూములు కాజేశారు ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టిరూ.25వేలకోట్ల అప్పులు తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపు 40వేల ఎకరాల దేవాదాయ భూమి క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని, దేవాదాయ శాఖ మంత్రి చెబుతున్నాడు. మంత్రిగా ఉండి రికార్డుల్లో ఉన్నభూమి ఫీల్డ్ లో లేదని చెప్పడానికి సిగ్గుందా అని  ప్రశ్నించారు.  ప్రభుత్వ ఆస్తులంటే తనతండ్రి సంపాదించిన ఆస్తులని జగన్ భావిస్తున్నా డా? దసపల్లా భూములు, కార్తీక వనం, బేపార్క్, ఎన్.సీ.సీ., రామానాయుడు స్టూడియో, భోగాపురం భూములు అప్పనంగా ప్రజల్ని భయపెట్టి లాక్కున్నారు. అవన్నీ కలిపితే వాటివిలువ దాదాపు రూ.70వే లకోట్లు ఉంటుంది. వాటితోపాటు రుషికొండను స్వాహాచేశారు. రుషికొండ విశాఖపట్నం మహానగరానికి రక్షణ కవచం లాంటిది. హుద్ హుద్ తుఫా న్ ప్రభావం గతంలో రుషికొండను తాకి వెనక్కు మళ్లింది. ఆ తుఫాన్ నుంచి విశాఖన గరాన్ని రుషికొండే కాపాడింది.  సీనియర్ మంత్రులైన బొత్స, ధర్మాన వంటివారు గతంలో ఎన్నోతప్పులు చేశారు. ఇప్పుడు జగన్ రెడ్డిని, అతని దోపిడీని సమర్థిస్తూ సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్నారు. 


ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయంపై మేధావులు మాట్లాడాలి !


విశాఖ మహానగరంతో  పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి జరుగుతున్న అన్యా యంపై మేథావులు, ప్రజాసంఘాలు స్పందించాలి. పాలకుల దుశ్చర్యలను గట్టిగా ప్రతిఘటించాలని కోరుతున్నాం. న్యాయస్థానాలు, ఎన్జీటీని కాదని, ప్రజాభీష్టానికి విరుద్ధంగా ముఖ్యమం త్రి నివాసం ముసుగులో రుషికొండపై నిర్మించే నిర్మాణాలను టీడీ ప్రభుత్వం రాగానే  ప్రజావసరాలకు, పర్యాటకశాఖకు కేటాయిస్తాం.  అలానే  విజయ సాయిరెడ్డి, జగన్ రెడ్డి ల దోపిడీని ఆధారాలతోసహా ప్రజలముందు ఉంచుతామని ప్రకటించారు.  ముఖ్యమంత్రి అయ్యాక జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి ఎంతదోచేశారో, ఎన్నివేల ఎకరాల భూములు దిగమింగారో అంతా బయటపెట్టి, ఇద్దరు తోడుదొంగల్ని శిక్షిస్తాం. లక్షల కోట్ల సంపదను ఏంచేసుకుంటాడో జగన్ సమాధానం చెప్పాలి. తండ్రి అధికారంతో పాటు, తన ముఖ్యమంత్రిత్వంలో దోచేసిన ప్రజలసొమ్ము అంతా కలిపితే దాదాపు రూ. 3 లక్షల కోట్లకు పైనే ఉందన్నారు.