Tsunami 2004: 2004 డిసెంబరు 26 అంటే అమ్మబాబోయ్ సునామీ మహమ్మారిని గుర్తు చేయవద్దంటారు గంగపుత్రులేకాదు జనం. హిందూ మహా సముద్రంలో సుమత్రా, ఇండోనేషియా దేశాలకి దక్షిణ తీరం కేంద్రంగా ఏర్పడిన సునామీ అంటే ఇప్పుడు శ్రీకాకుళం ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. ఆ చీకటి రోజులు గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. వారు చేపల వేటకు ఉపయోగించే బోట్లు రాకాసి అలలకు పూర్తిగా నాశనమైన పరిస్థితి ఎదుర్కోన్నారు. సునామీ సృష్టించిన నష్టాన్ని తలంచుకుంటు భయపడుతున్నారు గంగపుత్రులు. తీరప్రాంతవాసులు ఆ కెరటాలకు ఎంతోమంది మరణించారు. 



ఆ చీకటి రోజును ఇప్పటికి గుర్తు చేసుకుంటూ భయపడుతున్నాయి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్యకార కుటుంబాలు. ఆ రోజు జరిగిన సునామి కళ్ళకు కట్టినట్లు చెప్తున్నారు. డిసెంబర్ 26 న జరిగిన అలాంటి రోజు ఎప్పుడు రాకూడదని అంటున్నారు. 14 దేశాల్లో సుమారు 2,30,000 మందిని పొట్టనబెట్టుకుంది. దీని పరిమాణం 9.1–9.3 గా నమోదైంది. భారత భూభాగంలోని టెక్టోనిక్ ప్లేట్లు, బర్మా భూభాగానికి చెందిన టెక్టానిక్ ప్లేట్లతో రాపిడి చెందడం వల్ల సముద్రగర్భంలో భారీ భూకంపాలు ఏర్పడ్డాయి. దీని ఫలితంగా సముద్రపు అలలు సుమారు 30 మీటర్ల ఎత్తు వరకు ఎగసాయి. తీర ప్రాంతాలను ముంచి వేశాయి. 


ఈ విపత్తు వల్ల ఇండోనేషియా తీవ్రంగా నష్టపోయింది. శ్రీలంక, భారతదేశం, థాయ్‌లాండ్ దేశాలు ఈ భూకంపం ధాటికి దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రపంచలోనే అత్యంత ఘోరవిపత్తుల్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది. గంగమ్మని నమ్ముకున్న మత్స్యకారులకు జీవనం మాత్రం దినధనం గండంగానే మారుతుంది. వేటకు వెళ్లి తిరిగి వస్తారో లేదో తెలియదు. పరిస్థితులు ఏ రోజు ఎలా ఉంటాయో చెప్పలేని దుస్థితి. సునామీ వచ్చే సమయంలో అలానే ఉందంటున్నారు మత్స్యకారులు. ఊరు ఎక్కడో తెలియదు. చాలా ఇబ్బందులు పడ్డామంటున్నారు.  


ఆ రోజులను గుర్తు చేసుకున్న మత్స్యాకారులు... "పడవ తీసుకుని సముద్రానికి వేటకు వెళ్ళాము. అనుకోకుండా పెద్ద కెరటాలు ఒక్కసారిగా రావడంతో పడవ బోల్తా పడిపోయింది. మా వాళ్ళు చాలామంది చనిపోయారు. ఆ గాయం అనేది ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. పడవ కింద నేను కూడా ప్రాణాలతో నాలుగు గంటల పాటు యుద్ధం చేసి బయటికి వచ్చాను." అని చెబుతున్నారు. 



"ఇంత జరిగినా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం కూడా లేకుండా పోయింది. సునామి దాటికి అప్పట్లో కూడు గూడ చెదిరిపోయింది. అ దృశ్యం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. వేటకు వెళ్లి వస్తున్న సమయంలో నరకయాతనంతో అనుభవించాము. పెద్ద ఎత్తున కెరటాలు ఎత్తిన ఎగసిపడుతుంటే పడవల బోల్తా పడి ఆ పడవల కింద నలిగిపోయి నరకయాతన అనుభవించాము. ఆ సమయంలో మా వాళ్లు కొంతమంది గుజరాత్ వేటకు వెళ్లిన వాళ్ళు కొంతమంది చనిపోయారు. నేటికీ వాళ్ల శవాలు కూడా దొరికే పరిస్థితి లేదు. ఇక్కడ కూడా నరకయాత్ర అనుభవించాము. ఇక్కడ జట్టి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి మృత్యువాత పడిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. సునామి అనేసరికి మాకు గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి" అని ఓ మత్స్యకారుడు వాపోతున్నారు. 


Also Read: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!