సిక్కోలు నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యుల్లో పలువురు శ్రీకాకుళం జిల్లావాసులు కనిపిస్తారు. వారిని కదిలిస్తే ప్రతి చోటా కనీసం ఒక్కరైనా తమది ఫలానా గ్రామం అంటూ ఒకే ఊరి పేరు చెబుతారు. ఇలా దేశమంతటా సేవలందిస్తున్న వైద్య నారాయణుల శాశ్వత చిరునామా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలానికి చెందిన గ్రామం కణుగులవలస. ఒకప్పుడు నాటు వైద్యంపైనే ఆధారపడిన ఈ గ్రామంలో నేడు ప్రతి నాలుగు ఇళ్లలో ఒకరు వైద్య వృత్తిలో ఉండటం విశేషం. గతంలో ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే బతికి బట్టకట్టడం దైవాధీనం అన్నట్లుండే ఈ గ్రామస్తులు వైద్య శిబిరాలు వంటి వాటితో ఇతరు లకు వైద్య సేవలు అందించే స్థితికి ఎదిగారు.
S.Soma Shekhar, Paediatrician
వైద్యో నారాయణో హరి అంటారు పెద్దలు. అంటే వైద్యం చేసే వారు సాక్షాత్తూ నారాయణుడితో సమానం అని. మరి ఊరంతా అలాంటి వైద్యులే ఉంటే. ఆ ఊరిని వైకుం కమే ఆనాలేమో. ఆలాంటి ఓ గ్రామమే కణుగుల వలస. ఈ ఊరి పేరు చెబితే వెంటనే గుర్తుకొచ్చేది డాక్టర్లు, డాక్టర్లు అంటే ఆర్ఎంపీ, పీఎంపీ అనుకుంటే పొరపాటే. ఊరు ఊరంతా దాదాపు వైద్య వృత్తిలోనే స్థిరపడ్డారు. శ్రీకాకుళం రిమ్స్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్ వరకు ఈ ఊరికి చెందిన ఒక్కరైనా డాక్టర్‌గా ఉన్నారు.
Dr sreedevi, MD general medicine
చదివితే ఎంబీబీఎస్ చదవాలన్నది అక్కడి యువత టార్గెట్. ఒకరినొకరు ఆదర్శంగా తీసుకుని కన్న ఊరిని డాక్టర్ల గ్రామంగా మార్చేశారు. వైద్యంపై అమిత ప్రేమ. కణుగువలస గ్రామం ఆమదాలవలస నియోజకవ ర్గంలోనే కాదు జిల్లాలోనే పేరెన్నిక గల గ్రామం. ఆ గ్రామానికి చెందిన విద్యార్థులు వైద్య విద్యలో సత్తా చాటి ఆదర్శంగా నిలుస్తున్నారు. కృషి పట్టుదలతో తాము కోరుకున్న స్థానాలను అధిరోహిస్తున్నారు. ఒకరికొకరు సహకరించుకుని ఏకంగా గ్రామాన్నే ఆదర్శంగా నిలబెడుతున్నారు.
వైద్యుడిపై గౌరవంతో..
గ్రామ పొలిమేరలో ఓ డాక్టర్ విగ్రహం దర్శనమిస్తుంది. 2014లో రాజమండ్రిలో జరిగిన ప్రమాదంలో యువ డాక్టర్ బెండి సతీష్ దుర్మరణం చెందారు. ఆయనకు గుర్తుగా గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేశారు. వైద్య విద్యపై ఉన్న మక్కువతోనే చనిపోయిన వ్యక్తికి విగ్రహం ఏర్పాటు చేశామని గ్రామస్తులు చెబుతుంటారు.
బొడ్డేపల్లి నారాయణరావు... కలుగును వలస గ్రామపెద్ద
సొంతూరికి సహకారం..
ఆమదాలవలస పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కణుగులవలస గ్రామంలో సుమారు 100 మంది వైద్య విద్యనభ్యసించి డాక్టర్లుగా కొనసాగుతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్, నిమ్స్, ఉస్మానియా, గాంధీ, కేజీహెచ్ తదితర పెద్ద మెడికల్ కళాశాలలతో పాటు దేశంలో ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ సేవలందిస్తున్నారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల న్నింటిలోనూ కణుగులవలస గ్రామానికి చెందిన వారు డాక్టర్లుగా ఉన్నారు. శ్రీకాకుళం ప్రధాన ఆస్ప త్రుల్లో ఆ ఊరి డాక్టర్లు పదుల సంఖ్యలో ఉన్నారు. సొంత గ్రామానికి తమ వంతు సహకారం అందిం. చాలనే తపన కొందరి డాక్టర్లలో ఉన్నందున గ్రామం ఏర్పాటు చేస్తూ సేవలు లో నిత్యం వైద్య శిబిరాలు అందజేస్తున్నారు. తమ ఆస్పత్రులకు వచ్చే గ్రామ స్తులకు కొందరు ఉచితంగా, మరికొందరు ఫీజు తగ్గించి వైద్య సేవలందిస్తున్నారు ఆ ఇద్దరే స్ఫూర్తి దాతలు...
Doctor Boddepalli Suresh, General Physician
గ్రామంలో ఎలాంటి వ్యాధులు వచ్చినా ఒకప్పుడు నాటు వైద్యమే అక్కడ దిక్కుగా ఉండేది. గ్రామానికి చెందిన ఇద్దరు నాటు వైద్యులు వచ్చి వైద్య సేవలు అందిస్తే కొంత మందికి ఆరోగ్యం మెరుగుపడేది. మరికొందరు నాటు వైద్యం వికటించి మృత్యువాత పడేవారు. అప్పట్లో పరాస పట్టణానికి చెందిన జి.శాంతారావు అనే ఎంఎస్ సర్జన్ వద్దకు గ్రామం లోని స్థితిమంతులు వైద్యం కోసం వెళ్లేవారు. వీరి కష్టాన్ని చూసి ఆయన చేసిన సూచనలు గ్రామం లోని యువతను కదిలించాయి.
Doctor Boddepalli Srinu, Orthopaedic
మెడిసిన్ లాంటి చదువులు చదివితే గ్రామంలో వైద్య సేవలు అందించవచ్చునని, తగిన సూచనలు చేయడంతో అప్పటి యువతైన బెండి చంద్రరావు, నూక భాస్కరరావు 1970లో మొట్ట మొదటిసారిగా వైద్య చదువులు చదివి వైద్యులుగా పట్టా పొందారు. వారి తర్వాత వారి పిల్లలు వైద్య విద్యను చదివి సేవలందించారని గ్రామానికి పెద్దలు చెబుతుంటారు. అదే స్పూర్తితో సీనియర్లను ఆదర్శంగా తీసుకుని యువత వైద్య విద్యపై మక్కువ చూపించారు. ఒకరితో ఒకరు పోటీ పడి వైద్య చదువుల్లో ప్రతిభ చూపారు. అదే పంధాను నేటి యువత కూడా కొనసాగిస్తున్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనే పట్టుదల ఇక్కడ తల్లిదండ్రులకు ఎక్కువ. అందుకనే తొలుత వైద్య విద్యపైన... తప్పితే ఇంజనీరింగ్, ఉపాధ్యాయ వృత్తిపైనే ఆసక్తి చూపేలా పిల్లలను ప్రోత్స హిస్తున్నారు. అనుకున్నట్టే తమ లక్ష్యాన్ని సాధించి స్థిరపడుతున్నారు.