Traffic Diversions In Vizag: విశాఖపట్నం: వన్డే ప్రపంచకప్ 2023 ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్ కు టీమిండియా సన్నద్ధమైంది. నవంబర్ 23 (గురువారం) విశాఖపట్నం వేదికగా సిరీస్ లో తొలి మ్యాచ్ జరగనుంది. ఏ.సి.ఎ- వీ.డీ.సీ.ఏ డా.వై.ఎస్.ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఆస్ట్రేలియా, భారత్ తొలి టీ20 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ డా. ఏ.రవి శంకర్ అధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహణ సందర్భంగా విశాఖలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగర వాసులు ఈ వివరాలు తెలుసుకుని ప్రయాణం చేయాలని పోలీసులు రిక్వెస్ట్ చేశారు.
విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు..
1) మధురవాడ క్రికెట్ స్టేడియం స్టేడియం కెపాసిటీ 28,000. మ్యాచ్ తో సంబంధం లేని వాహనదారులు మధురవాడ క్రికెట్ స్టేడియం వైపు ప్రయాణించకుండా, వేరే మార్గాలలో ప్రయాణించాలి.
2) శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుంచి విశాఖపట్నం నగరం లోకి వచ్చే బస్సులు, ఇతర కమర్షియల్ వాహనాలు, మారికవలస వద్ద, ఎడమ వైపునకి తిరిగి, జురాంగ్ జంక్షన్ మీదుగా తిమ్మాపురం చేరి, కుడి వైపు తిరిగి బీచ్ రోడ్డు నుంచి ఋషికొండ, సాగర్ నగర్, జోడుగుళ్లపాలెం మీదుగా వెళ్లాలి.
4) శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుంచి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు మొదలైనవి, కార్ షెడ్ వద్ద నుంచి మిధిలాపురి కాలనీ మీదుగా, MVV సిటీ వెనుకగా వెళ్లి, లా కాలేజీ రోడ్డు మీదుగా NH 16 చేరి నగరంలోనికి ప్రవేశించాలి. లా కాలేజీ రోడ్డు నుంచి, పనోరమ హిల్స్ మీదుగా, ఋషికొండ మీదుగా కూడా నగరం లోకి వెళ్లవచ్చు
5) విశాఖపట్నం సిటీ నుంచి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్ళు బస్సులు ఇతర కమర్షియల్ వాహనములు, హనుమంతవాక నుంచి ఎడమ వైపు తిరిగి, ఆరిలోవ brts రోడ్డు లో వెళ్లి, అడివివరం వద్ద కుడి వైపు తిరిగి ఆనందపురం మీదుగా వెళ్లాలని సూచించారు
6) విశాఖపట్నం నగరం నుంచి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్ళు, కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు మొదలైనవి హనుమంతవాక జంక్షన్ నుంచి ఎడమ వైపు తిరిగి, అడివివరం మీదుగా ఆనందపురం వెళ్ళవచ్చు. లేదా హనుమంతవాక జంక్షన్, లేదా విశాఖ వాలీ జంక్షన్, లేదా ఎండాడ జంక్షన్ వద్ద కుడి వైపునకు తిరిగి బీచ్ రోడ్డు చేరి, తిమ్మాపురం వద్ద ఎడమవైపు తిరిగి, మారికవలస వద్ద NH 16 చేరవచ్చునని పోలీసులు తెలిపారు.
భారీ వాహనాలకు ట్రాఫిక్ సూచనలు..
1) నవంబర్ 23న ఉదయం 06:00 గంటల నుంచి రాత్రి 12:00 గంటల వరకు ఎటువంటి భారీ వాహనాలు మధురవాడ స్టేడియం వైపు అనుమతించరు
2) అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్ళు వాహనాలు, నగరం లోకి రాకుండా, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి
3) శ్రీకాకుళం, విజయనగరం, వైపు నుంచి అనకాపల్లి వైపు వెళ్ళు వాహనాలు నగరంలోకి రాకుండా, ఆనందపురం నుంచి పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి వైపు వెళ్లాలి
4) విశాఖపట్నం నగరం నుంచి బయలుదేరి, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్ళు భారీ వాహనాలు అన్నీ అనకాపల్లి వైపు వెళ్లి, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలని సూచించారు
5) శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి విశాఖపట్నం సిటీలోకి వచ్చే భారీ వాహనాలు ఆనందపురం నుండి పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి మీదుగా విశాఖ సిటీలోకి చేరుకోవాలి.
మ్యాచ్ చూడడానికి వచ్చే వాహనదారులకు సూచనలు..
1) విశాఖపట్నం నగరం వైపు నుంచి స్టేడియానికి వచ్చే VVIP, VIP వాహనదారులు, NH 16 లో స్టేడియం వరకు ప్రయాణించి, A గ్రౌండ్, B గ్రౌండ్, V కన్వెన్షన్ గ్రౌండ్ లలో వారి వారి పాస్ ప్రకారం చేరుకోవాలి
2) విశాఖపట్నం వైపు నుంచి స్టేడియానికి వచ్చే టికెట్ హోల్డర్స్, NH 16 లో ప్రయాణించి, స్టేడియం వద్ద హోల్డ్ ఏజ్ జంక్షన్ వద్ద ఎడమ వైపు తిరిగి, సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో పార్కింగ్ చేసుకోవాలి. సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో, ఆన్ లైన్ టికెట్స్ ను, ఒరిజినల్ టికెట్స్ గా మార్చుకోవడానికి కౌంటర్లు ఏర్పాటు
3) శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం, గంభీరం, బోయపాలెం, కొమ్మాది వైపు నుంచి వచ్చేవారు కార్ షెడ్ జంక్షన్ వద్ద కుడి వైపు తిరిగి, సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీ పార్కింగ్ గ్రౌండ్ చేరవలెను. లేదా కార్ షెడ్ జంక్షన్ నుంచి ఎడమ వైపు తిరిగి, మిధిలాపురి కాలనీ మీదుగా వచ్చి, MVV సిటీ డబల్ రోడ్డు, పోలిశెట్టి వేణుగోపాలరావు గ్రౌండ్ ల లో పార్కింగ్ చేసుకోవాలి
4) విశాఖపట్నం సిటీ నుంచి లేదా భీమిలి వైపు నుంచి బీచ్ రోడ్డు మీదుగా స్టేడియానికి వచ్చేవారు IT SEZ మీదుగా వచ్చి MVV సిటీ డబల్ రోడ్డు చేరి పార్కింగ్ చేసుకోవలెను.
5) విశాఖపట్నం నగరం నుంచి వచ్చే Rtc స్పెషల్ బస్సులు NH 16 లో రాకుండా, బీచ్ రోడ్డు లో వచ్చి, IT SEZ మీదుగా వచ్చి లా కాలేజీ రోడ్డులో పార్కింగ్ చేయాలి
6) శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుంచి వచ్చే rtc స్పెషల్ బస్సులు, మారికవలస, తిమ్మాపురం, IT SEZ మీదుగా వచ్చి లా కాలేజీ రోడ్డు చేరి పార్కింగ్ చేసుకోవాలని వైజాగ్ సీపీ సూచించారు.