సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో ఈ తెల్లవారుజామున జరిగిన గోడ కూలి 8 మంది చనిపోయారు. ఈ దుర్ఘటనలో విశాఖపట్నానికి చెందిన నవ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర షాక్ కు గురించేసింది. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు.

Continues below advertisement


అధికారుల ఇస్తున్న వివరాల ప్రకారం, ఉమామహేశ్వరరావు, శైలజ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్‌లోని వేర్వేరు IT సంస్థల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ వైజాగ్ లోని ఇంటి నుంచే (వర్క్ ఫ్రమ్ హోం) విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. సింహాచల స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజామున 2 గంటల సమయంలో రూ. 300 ప్రత్యేక దర్శనం క్యూలైన్‌లో వీరు వేచి ఉన్నారు. అదే సమయంలో అక్కడున్న గోడ ఒక్కసారిగా కూలి వారిపై పడటంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు.


ఉమామహేశ్వరరావు, శైలజ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, అందరితో కలివిడిగా మెలిగేవారని స్థానికులు, బంధువులు చెబుతున్నారు. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్న సమయంలో ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం వారి కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. వారి స్వగ్రామమైన చంద్రంపాలెం వాసులు ఈ ఘటన తో షాక్ కు గురయ్యారు.


ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి 


మదురవాడ చంద్రం‌పాలెం మృతి చెందిన భార్య భర్తలు.. పిళ్ళా ఉమా మహేశ్వరావు(30)., పిల్లా శైలజ(29) లతో పాటు శైలజ తల్లి పైలా వెంకట రత్నం, మేనత్త  గుజ్జారి మహాలక్ష్మి మృతి చెందారు. వీరు ఇసుక తోట ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఉమామహేశ్వర్ రావు, శైలజ (దంపతులు )సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం, చందనోత్సహం చూడాలని వెళ్తే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలు పోవడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 



వైజాగ్ కు చంద్రబాబు, జగన్ పవన్ కళ్యాణ్ 


సింహాచలం దుర్గటన నేపథ్యంలో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. మృతుల కుటుంబాలకు భారీ గా నష్ట పరిహారం ప్రకటించిన సీయం చంద్రబాబు కాసేపట్లో సింహాచలం వెళ్లనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవవ్ కళ్యాణ్ ఇప్పటికే అక్కడికి వెళ్లారు. మరోవైపు విపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కూడా మధ్యాహ్నం నుండి వైజాగ్ వెళ్లి మృతుల కుటుంబాలను  పరామర్శించనున్నారు.