విజయనగరం జిల్లా చినమేడపల్లిలో గిరిజన యూనివర్సిటీకి కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్‌తో కలిసి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 2వేల కోట్ల రూపాయలతో ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. గత ప్రభుత్వం హయాంలోనే ఈ యూనివర్శిటీకి ఒకసారి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు రెండోసారి సీఎం జగన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగింది. 


ఈ సందర్బంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ... రాయ్‌పూర్ నుంచి విశాక వరకు ఆరులైన్ల రోడ్డు ఏర్పాటవుతుందన్నారు. పేదలకు సొంత ఇళ్లు అందివ్వాలన్న ఆశయంతో కేంద్రం లక్షా 20 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. కేంద్రరాష్ట్రాల్లో ఏ పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా అభివృద్ధి కోసం కలిసి పని చేస్తున్నామన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా విద్యలో మార్పులు చేసిందని తెలిపారు మంత్రి. బైలింగ్వల్‌ పాఠ్యపుస్తకాలు ప్రస్తావించారు. అల్లూరి సీతారామరాజు నడిచిన పవిత్ర నేలపై గిరిజన యూనివర్శిటీ ఎందో గిరిజనులకు భవిష్యత్‌ ఇస్తుందని ఆకాంక్షించారు. అంతర్జాతీయ కోర్సులు ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. 


విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి ఇవాళ శంకుస్థాపన జరిగిం.ి దీని కోసం 834 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. విభజన హామీల్లో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు ఒకటి. గత ప్రభుత్వం హయాంలోనే ఒకసారి శంకుస్థాపన చేశారు. 


రాబోయే రోజుల్లో ప్రపంచంతో పోటీ పడేలా గిరిజనులు తయారు కావాలనే ఉద్దేశంతో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు సీఎం జగన్. గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేసిన ప్రధానమంత్రికి జగన్ కృతజ్ఞతలు చెప్పారు. 


తరాలుగా అభివృద్ధిలో వెనకుబడిన గిరిజనుల అభివృద్ధి కోసం నాలుగేళ్లుగా అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు జగన్. విద్య, వైధ్య, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. దోపిడీ నుంచి గిరిజనులను రక్షించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. 


విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చి మూడో తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్లను నియమిస్తున్నట్టు తెలిపారు జగన్. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించామని వివరించారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు విద్యాదీవెన, వసతి దీవెను, విదేశీ విద్యకు నిధులు భారీగా కేటాయిస్తూనే పూర్తి స్థాయి ఫీజు రియింబర్స్‌మెంట్‌ చేస్తున్నట్టు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 


కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, పాడేరులో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు జగన్. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రం ఏర్పాటవుతోందన్నారు. ఏజెన్సీలో ఉండే సచివాలయాల్లో వలంటీర్లంతా గిరిజనులేనన్నారు.