Ganta Srinivasa Rao Comments On Jagan In Visakha: విశాఖ ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డిని విశ్వసించరని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళలో ఏర్పాటు చేయాల్సిన సదస్సును.. అధికారం కోల్పోయే చివరి దశలో ఏర్పాటు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా చివరి రోజుల్లో విజన్ వైజాగ్ పేరుతో సద్దస్సు పెట్టారని గంటా ఆరోపించారు. సిగ్గు ఉంటే దీనిపై మరోసారి అలోచించుకోవాలని సూచించారు.


విశాఖలో పోటీ చేసిన విజయమ్మను ఇక్కడి ప్రజలు ఘోరంగా ఓడించాలని, దీనికి కారణం ప్రజలు నమ్మకపోవడమేనని గంటా పేర్కొన్నారు. విశాఖ ప్రజలు ఎలాంటి పార్టీని కోరుకుంటున్నారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. 2019లో ఒక్క చాన్స్ అంటే ప్రజలు నమ్మారని, అటువంటి పరిస్థితిలో విశాఖలోని నాలుగు దిక్కుల్లోనూ వైసీపీని ఓడించారని గంటా విమర్శించారు. విశాఖలోని నాలుగు దిక్కుల్లో స్థానం లేకుండా చేసిన విషయాన్ని గుర్తించుకోవాలని స్పష్టం చేశారు గంటా. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీని విశాఖ ప్రజలు గెలిపించారని వివరించారు. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేశారని, ఓటర్లను బయటపెట్టారని, ప్రలోభాలు పెట్టినా ఆఖరుకు చిరంజీవికే ఈ ప్రాంత ప్రజలు పట్టం కట్టిన విషయాన్ని గంటా గుర్తు చేశారు. 


విశాఖలో అభివృద్ధి ఏం చేశారు


గడిచిన ఐదేళ్ళలో విశాఖలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని గంటా ప్రశ్నించారు. బస్సు షెల్టర్, ఫ్లోటింగ్ బ్రిడ్జీ ఇరిగిపోయిందని, ఐదేళ్ళలో ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా పెట్టలేదన్నారు. కానీ, ఐదేళ్లలో 15 ఎలిప్యాడ్లు ఏర్పాటు చేశారని విమర్శించారు. పరదాలు కట్టాలి, చెట్టులు నరకాలన్నట్టుగా పాలన సాగిస్తున్నారని గంటా శ్రీనివాసరావు దుయ్యబట్టారు. మద్యపాన నిషేధం, రైల్వే జోన్, ప్రత్యేక హోదా ప్రజలు అడుగుతారనే సీఎం జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లలో తిరుగుతున్నారని మాజీ మంత్రి గంటా విమర్శించారు. వచ్చే ఎన్నికల తరువాత విశాఖలో ఉంటానని సీఎం చెబుతున్నారని.. అది కలగానే మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు.   


గడిచిన ఐదేళ్లలో ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 2014 - 2019 మద్య కాలంలో ఐఐఎం, ఐఐటపీఈ, ఐఎస్ఆర్, నిట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ తరహా ప్రతిష్టాత్మక సంస్థలను ఈ ఐడియాలలో ఒకటైన ఏర్పాటు చేశారా అని గంటా శ్రీనివాసరావు సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.  చంద్రబాబు హయాంలో విశాఖలో ఏర్పాటు చేసిన టెంపుల్టన్, లులు, హెచ్ఎస్బిసి వంటి ప్రముఖ సంస్థలను విశాఖ నుంచి తరిమేసారని ఆరోపించారు. గతంలో తాము ప్రోత్సహించిన 100కు పైగా స్టార్టప్ కంపెనీలను మూసేశారని, రన్నింగ్ లో ఉన్న ఎన్నో ఐటి కంపెనీలు మూతపడ్డాయని గంటా విమర్శించారు.


అమరావతిని వరల్డ్ క్లాసు రాజధానిగా అభివృద్ధి చేసే ఉద్దేశంతో దేశంలోనే ప్రముఖ సంస్థలను అమరావతికి ఆహ్వానించామన్నారు. అమరావతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు 18 వచ్చి తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుగుణంగా 27 ఎకరాలు అందించామని, ప్రస్తుతం అవన్నీ నిర్వీర్యం అయిపోయాయని గంటా ఆవేదన వ్యక్తం చేశారు.  24 కేంద్ర ప్రభుత్వ రంగ విభాగాలకు 200కు పైగా ఎకరాలను కేటాయించామని, రాజధాని ఎక్కడో తెలీక ఆయా సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేయలేని దుస్థితిలో ప్రస్తుతం ఉన్నాయన్నారు. ఇవన్నీ విస్మరించి సీఎం జగన్మోహన్ రెడ్డి తన కలల రాజధాని విశాఖ అంటూ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని, సిగ్గు లేకుండా మాట్లాడడం దారుణమని గంట విమర్శించారు