Nara Lokesh questions AP CM Jagan: ‘నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడింది. నోటీసులు ఇస్తామంటూ పోలీసుల అరెస్ట్ డ్రామా, దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే జగ్గడు గట్టిగానే భయపడినట్టు కనిపిస్తుందంటూ’ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కామెంట్ చేశారు. ఏపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటికి నోటీసులు పంపడం, ఆయన ఇంటి గోడ కూల్చివేయడాన్ని లోకేష్ తీవ్రంగా ఖండించారు. పర్మిషన్ తీసుకున్నామని కుటుంబసభ్యులు వారిస్తున్నా అయ్యన్న ఇంటి గోడను నర్సీపట్నం మునిసిపల్ సిబ్బంది జేసీబీతో కూల్చివేశారు. కక్షపూరితంగా అయ్యన్నపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. 


ఉత్తరాంధ్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనకు వచ్చిన జన జాతర, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత చూసి ఏపీ సీఎం పిరికిపంద చర్యలు మొదలెట్టారని విమర్శంచారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండించారు. మూడేళ్ల తరువాత కూడా ప్రతిపక్ష నేతల ఇళ్లు కూల్చడం, అరెస్టులనే నమ్ముకున్న సీఎం జగన్ రెడ్డి దుస్థితి చూస్తుంటే జాలేస్తుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.






ప్రజా క్షేత్రంలో ఎదురుకోలేక ఇలాంటి చర్యలు..
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న కారణంతో టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కక్షగట్టిందన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu). ప్రజా క్షేత్రంలో అయ్యన్నను ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయిస్తూ ఉద్దేశ పూర్వక దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. గూండా రాజుగా సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) చరిత్రలో నిలిచిపోతారని.. ఇకనైనా మానుకుని ప్రజలకు మేలు చేసే పనులపై ఫోకస్ చేయాలని అచ్చెన్నాయుడు సూచించారు.


వైఎస్ జగన్ ప్రభుత్వం తప్పులను ప్రశ్నించిన కారణంగానే అయ్యన్న పాత్రుడ్ని వేధిస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. బీసీ నేతల్ని లక్ష్యం చేసుకుని పోలీసుల సాయంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు యాత్రకు విశేష స్పందన రావడాన్ని చూసి తట్టుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తాడేపల్లి ఆదేశాలను ఏపీ డీజీపీ అమలు చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని.. భవిష్యత్తులో అధికారులకే ఇబ్బందులు తప్పవన్నారు.


Also Read: Ayyanna Patrudu Son Rajesh: పర్మిషన్ తీసుకుని నిర్మించినా, అక్రమ కేసులు బనాయించి కూల్చివేతలా ? 


Also Read: Ayyanna Patrudu: నర్సీపట్నంలో హైటెన్షన్ - అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేత, భారీగా పోలీసుల మోహరింపు