ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు గురువారం (అక్టోబరు 12) కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పెద్దాపురంలో ఓ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటుగా, సామర్లకోటకు చేరుకోనున్నారు. సామర్లకోటలో సీఎం జగన్ జగనన్న కాలనీని ప్రారంభించనున్నారు. అక్కడ లబ్ధిదారుల ఇళ్ల పరిశీలన, వైఎస్సార్ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు.


ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ కాకినాడకి బయలుదేరి వెళ్లనున్నారు. 10 గంటలకు కాకినాడలోని పెద్దాపురం చేరుకుంటారు. అక్కడ పది నిమిషాల పాటు స్థానిక నేతలు, కార్యకర్తలతో సీఎం జగన్ మాట్లాడతారు. అవనున్నారు. అనంతరం సామర్లకోటకు ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. జగనన్న కాలనీలో లబ్ధిదారుల ఇళ్ల పరిశీలన, వైఎస్సార్ విగ్రహ ఆవిష్కరణను నిర్వహించనున్నారు. 11 గంటలకు బహిరంగ సభ వేదిక వద్దకు సీఎం చేరుకోనున్నారు. 40 నిమిషాల పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తిరిగి తాడేపల్లికి ముఖ్యమంత్రి జగన్‌ చేరుకుంటారు.


సామర్లకోటలో 57 ఎకరాలలో ప్రభుత్వం 2,412 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. విడతల వారీగా లబ్ధిదారులకు ప్రభుత్వ ఇళ్లను అందజేస్తోంది. రెండు ప్రాంతాల్లో జగనన్న లే అవుట్లను ఏర్పాటు చేశారు. సెంటు స్థలంలో ఇల్లు నిర్మాణం చేపట్టారు. ఇళ్ల నిర్మాణం కోసం 1.80 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేసింది.