AP Rains: రోడ్డుపై ఏర్పడ్డ గుంతలో బురద ఉన్నా ఈత కొడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పార్వతీపురం - రాయగడ జాతీయ రహదారిపై భారీగా ఏర్పడిన గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దాంతో కొమరాడ వద్ద వర్షం వల్ల ఏర్పడిన గుంతల్లో బురద నీటిలో ఈత కొడుతూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు


జూలై 26వ తేదీ లోపు అంతరాష్ట్ర రహదారిపై ఉన్న పెద్ద పెద్ద గోతుల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 26వ తేదీన గోతులు వద్ద నిరాహార దీక్ష చేస్తాం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతరాష్ట్ర రహదారి పైన కొమరాడ మండల కేంద్రానికి సమీపంలో ఈశ్వరుని ఆలయం వద్ద పెద్ద గొయ్య ఉన్న నీటిలో ఆదివారం సిపిఎం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈత కొడుతూ నాటులు వేస్తూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఇప్పటికైనా రోడ్లు భవనాలు శాఖ అధికారులు స్పందించి పార్వతీపురం నుంచి కొమరాడ మీదుగా కూనేరు వరకు మూడు రాష్ట్రాలకు వెళ్లే అంతరాష్ట్ర రహదారి మార్గంలో  ఉన్న పెద్ద పెద్ద గోతులను పూడ్చివేయాలని కోరారు. దాంతో అటు వాహనదారులు ఇటు ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆదివారం కొమరాడ మండల కేంద్రంలో ఈశ్వరి ఆలయం వద్ద బురదలో ఈత కొడుతూ నిరసన తెలిపారు.


సిపిఎం పార్టీ జిల్లా కమిటీ కొల్లి సాంబమూర్తి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఏ ఉపేంద్ర, తెలుగుదేశం పార్టీ నేతలు బత్తిలి శ్రీనివాసరావు, స్టి ఎస్సీ సెల్ నాయకులు పాలక నూకరాజు మీడియాతో మాట్లాడారు. ఇటు ఆంధ్ర నుంచి అటు ఒడిశాతో పాటు మూడు రాష్ట్రాల నుంచి  పార్వతిపురం విశాఖపట్నం వచ్చే వాహనాలు ఇటు విజయనగరం విశాఖపట్నం పార్వతీపురం నుండి రాయగడకు వాహనాలు వెళ్తాయన్నారు. కొమరాడ మండల కేంద్రానికి అతి సమీపంలో కొన్ని రోజుల కిందట ఈశ్వరుని ఆలయం వద్ద ఒక లారీ పెద్ద గోతిలో దిగడంతో, బంగారంపేట గ్రామ సమీపంలో ఒక లారీ గోతిలో దిగిపోవడంతో రెండు లారీలు గోతిలో ఇరుక్కుపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కొమరాడ పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించి వాహనాలు క్లియర్ చేసే పరిస్థితిలో ఒక్కొక్క లారీని అటు రాయగడ ఇటు పార్వతీపురం కి వెళ్లే విధంగా చేసి 12 గంటలపాటు శ్రమించి ట్రాఫిక్ క్లియర్ చేశారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో అటు వాహనదారులు, ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. రోడ్లు భవనాల శాఖ అధికారులు గ్రీవెన్స్ ద్వారా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామన్నారు. 


జగనన్నకి చెబుదామని దరఖాస్తు ఇచ్చినప్పుడు కూడా అర్థం గ్రామం వద్ద ఉన్న గోతులను పూడ్చివేస్తామని చెప్పారు. కానీ ఆ దిశగా మరమ్మతుల పనులు చేయలేదని వాపోయారు. ఒకవైపు ఇన్సూరెన్స్ లేకపోయినా యూనిఫారం లేకపోయినా కేసుల మీద కేసులు వేస్తారని, కానీ ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. మాజీ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కురుపాం ఎమ్మెల్యే  పాముల పుష్ప శ్రీవాణి, డిప్యూటీ సీఎం పిడకరాజన్న దొర  అభివృద్ధి చేశామని  చెప్పుతున్నారు. కానీ రోడ్లు వేయకపోతే ప్రజలు ఇబ్బంది పడరా అని ప్రశ్నించారు. రోడ్లు సరిగా లేదని, గుంతలు పూడ్కాలని పలుమార్లు రోడ్లు భవనాల అధికారులు చెప్పినప్పుడు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే వర్షాకాలం పూర్తయ్యేసరికి ఇంతకన్నా పెద్ద పెద్ద గోతులలో నీరు చేరి వాహనాల రాకపోకలు నిలిచిపోయి, భారీగా ట్రాఫిక్ జాం అయ్యే పరిస్థితి ఉందన్నారు.


మూడు రాష్ట్రాలకు వెళ్లే దారులలో ప్రయాణం అంటే వాహనదారులు ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుందన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ బటన్ నొక్కి రోడ్ల మరమ్మతులకు ఆదేశించాలని కోరారు. రోడ్లు భవనాల శాఖ అధికారుల ఆధ్వర్యంలో పార్వతీపురం నుంచి కునేరు  వరకు వెళ్లే అంత రాష్ట్ర రహదారి పైన ఉన్న పెద్దపెద్ద గోతులు సాధ్యమైనంత త్వరగా పూడ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలని, లేకపోతే జూలై 26వ తేదీన గోతుల వద్ద నిరాహార దీక్షతో పాటు పలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.