AP Government Rushikonda Palace decision : విశాఖ రుషికొండ ప్యాలెస్ ఎంత వివాదాస్పదం అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  రూ.500 కోట్లతో అత్యంత విలాసవంతంగా నిర్మించిన ఈ  ప్యాలెస్‌ను ప్రభుత్వం ఇప్పుడు ఏమి చేయాలన్నది ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఈ భవనాల నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారింది. పూర్తిగా వినియోగించుకుంటే విద్యుత్‌ బిల్లులే నెలకు లక్షల్లో వస్తాయని అధికారులు లెక్కలేశారు. ఇతర నిర్వహణ ఖర్చులు చూసుకుంటే ప్రభుత్వం ఎలా వాడుకున్నా భారమవుతుంది. ఈ కారణంగా ఆదాయం కోసమైనా ప్రైవేటు వారికి ఇవ్వాలన్న అభిప్రాయం ఎక్కువ మంది నుంచి వస్తోంది. 


స్టార్ హోటల్ పేరుతో నిర్మాణం 


రుషికొండపై గతంలో టూరిజం కాటేజీలు ఉండేవి. వాటిని కూల్చి  ఏడు నక్షత్రాల హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌, గదులు నిర్మించేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే అది హోటల్‌గా నిర్మించలేదు.  ఐదు బ్లాకుల్లో  బెడ్‌రూంలు, డైనింగ్‌, లివింగ్‌ రూమ్‌లు, సమావేశ మందిరాలు నిర్మించారు.  ఐదు బ్లాకుల భవనాలను 1,48,413 చ.అ. విస్తీర్ణంలో నిర్మించారు. నవంబరు నుంచి రుషికొండ ప్యాలె్‌సకు విద్యుత్‌ వినియోగిస్తున్నారు. అప్పటి నుంచి నెలకు సగటున రూ.7 లక్షల విద్యుత్‌ బిల్లు వస్తోంది. విద్యుత్‌ బిల్లులు చెల్లించ క ఇప్పటి వరకు దాదాపు రూ.85 లక్షల బకాయిలు పేరుకుపోయాయి. నిర్వహించడం అంత తేలిక కాదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నయి.           


ఆకాశంలో అద్భుతం - పున్నమి ఘాట్‌లో డ్రోన్ షో అదుర్స్ !


కార్పొరేట్‌లకు అద్దెకు ఇస్తారా ? 


 వివిధ పరిశ్రమలు, విద్యా సంస్థలకు సంబంధించి తరచూ భారీ కార్పొరేట్‌ సమావేశాలకు అద్దెకు ఇస్తే బాగుంటుందని  పారిశ్రామికవేత్తలు ఇటీవల విశాఖకు వచ్చిన మంత్రి  మంత్రి నారా లోకేశ్‌కు సూచించినట్లుగా తెల్సోతంది.   ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ,  లోకేశ్ కూడా ఇప్పటి వరకూ లోపలకు వెళ్లి చూడలేదు. పవన్ ఇటీవల రుషికొండపైకి వెళ్లారు కానీ .. భవనం లోపలికి వెళ్లలేదు.  దాదాపు రూ.500 కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ ప్యాలెస్‌ వినియోగానికి గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానించాలని, ఆసక్తితో ముందుకు వచ్చే సంస్థల ప్రతినిధులకు దానిని చూపించే ఏర్పాట్లు చేయాలని పారిశ్రామికవేత్తల నుంచి ప్రభుత్వానికి సలహాలు వస్తున్నాయి. 


ఐటీ మాదిరిగానే డ్రోన్ విప్లవం రాబోతోందీ- అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో చంద్రబాబు కామెంట్స్


నిర్వహణ లేని భవనాలు                 
 
రుషికొండ ప్యాలె్‌సను ప్రస్తుతం  ఏపీటీడీసీకి అప్పగించారు.  ప్రస్తుతం భవనాలకు తాళాలు వేసి ఉంచారు. కాపలాగా సెక్యూరిటీని పెట్టారు. నిర్వహణ లేకపోవడంతో భవనాలు దుమ్ము పట్టేశాయి.  సముద్రాన్ని ఆనుకొని ఉండడంతో ఉప్పు నీటి గాలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.  సరైన నిర్వహణ లేకపోతే కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన గృహోపకరణాలు పాడైపోయే అవకాశం ఉందని అందుకే వీలైనంత వేగంగా వినియోగంలోకి తేవాలని సూచిస్తున్నారు.