YS Jagan in Vizag Tour: విశాఖపట్నం: విశాఖ నగరంలో సుమారు 1000 కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం పరిశీలించారు. అనంతరం అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. సుమారు 600 కోట్ల రూపాయల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కైలాసపురం లో నిర్మించనున్న ఇనార్బిట్ మాల్ (రాష్ట్రంలో తొలి మాల్) కు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు.
జీవీఎంసీకి సంబంధించి సుమారు 138 కోట్ల రూపాయలు వేయడంతో చేపట్టనున్న మూడు ప్రాజెక్టులకు ఏం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్టు మంత్రి అమర్నాథ్ తెలియజేశారు. ఇందులో 106 కోట్ల రూపాయలతో అమృత్ పథకం కింద అనకాపల్లి విశాఖపట్నం నగరంలోని వివిధ ప్రాంతాలకు తాగునీటిని అందించే పథకం, 16 కోట్ల రూపాయలతో విశాఖ నగరంలో ప్రధాన కూడళ్లను విస్తరించే కార్యక్రమానికి అలాగే 11 కోట్ల రూపాయలు ఎంతో నగరంలోని బీటీ రోడ్ల నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. అదేవిధంగా సిరిపురం వద్దనున్న ఫార్మ ఇంక్యుబేషన్, బయో మానిటరింగ్ హబ్తో పాటు మరో నాలుగు ప్రాజెక్టలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. గత మూడు సంవత్సరాలుగా ఆంధ్రవిశ్వవిద్యాలయంలో దాదాపు 18 నూతన అభివృద్ది ప్రాజెక్టులను అభివృద్ధి చేసారు. ముఖ్యమత్రి చేతుల మీదుగా టెక్ స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్` ఆ హబ్, ఫార్మ ఇంక్యుబేషన్ ` ఎలిమెంట్, ఏయూ డిజిటల్ జోన్ అండ్ స్మార్ట్ క్లాస్రూం కాంప్లెక్స్` అల్గారిథమ్, ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్(ఏయూ సిబ్), ఏయూ అవంతి ఆక్వా కల్చర్ ఇన్నోవేషన్ స్కిల్ హబ్లను ప్రారంభించనున్నారని ఆయన వివరించారు. ఆంధ్ర యూనివర్సిటీలోని కొత్తగా ఏర్పాటు చేసిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆ హబ్....
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆవిష్కర్తలుగా, భవిష్యత్ పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే వేదికగా ఆ హబ్ని తీర్చిదిద్దారు. ఇంజనీరింగ్ కళాశాలలో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ 21 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. దీనిలో ఇప్పటికే 121 స్టాప్టప్లు పనిచేస్తూ వీటిలో 114 వరకు ఆర్ధిక వనరులను సృష్టించే స్థాయికి చేరుకున్నాయి.
ఎలిమెంట్.....
ఫార్మ ఇంక్యుబేషన్, బయోలాజికల్ మానిటరింగ్ హబ్గా ఎలిమెంట్ను ఏర్పాటు చేసారు. దాదాపు 55 వేల సదరపు అడుగుల విస్తీర్ణంలో ఫార్మ, బయో, జినోమిక్స్ ఇంక్యుబేషన్, టెస్టింగ్ ల్యాబ్గా దీనిని దాదాపు 44 కోట్ల రూపాయలతో దీనిని ఏర్పాటు చేసారు. ఔషధ రంగాలలో స్టార్టప్ ఇన్నోవేషన్ ని ప్రోత్సహించే విధంగా ఎలిమెంట్ ఏర్పాటు చేసారు.
అల్గారిథం....
ఆంధ్రవిశ్వవిద్యాలయం డిజిటల్ జోన్, స్మార్ట్ క్లాస్రూం కాంప్లెక్స్ని అల్గారిథంగా పేరు పెట్టారు. ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం ఎదురుగా 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో రూ 35 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించడం జరిగింది. ఈభవనంలో 250 మంది కూర్చునే సామర్ధ్యం కలిగిన సెమినార్ హాళ్లు 2, స్మార్ట్ క్లాస్ రూమ్లు 15, ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు ఉపయుక్తంగా 500 కంప్యూటర్లతో కూడిన ఒక పూర్తి అంతస్థును కలిగి ఉంది.
ఏయూ సిబ్....
ఆంధ్రయూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్( ఏయూ సిబ్)ని ఏయూ అవుట్గేట్కి అనుకుని ఏర్పాటు చేసారు. 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం నిర్మాణానికి రూ 15 కోట్లు ఖర్చుచేసారు. ఐఐఎం విశాఖపట్నంతో అవగాహన ఒప్పందం చేసుకుని ఏయూ సిబ్ నుంచి ఎంబిఏ కోర్సును నిర్వహిస్తున్నారు. ఇంటర్నేషనల్ బిజినెస్, అనలటిక్స్ రంగాలలో బ్యాచిలర్, పీజీ కోర్సులకు ఈ కేంద్రంలో నిర్వహిస్తారు.
ఏయూ అవంతి ....
బీచ్రోడ్డులో ఏయూ`అవంతి ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ అండ్ స్కిల్ హబ్ ని 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసారు. తొలి దశలో దాదాపు రూ 11 కోట్ల వ్యయంతో దీనిని ఏర్పాటు చేసారు. అవంతి ఫౌండేషన్తో చేసుకున్న అవగాహన ఒప్పందంలో భాగంగా మెరైన్ ఫార్మింగ్ రగంలో నైపుణ్య శిక్షణ, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ప్రోత్సహించే దిశగా ఈ కేంద్రం సేవలు అందిస్తుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial