Supreme Court On Amaravati petitions: కేవలం తమ ప్రాంతాల అభివృద్ధి చెందాలనే వ్యక్తిగతమైన స్వార్థానికి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఏపీ సీఎం జగన్ అభిప్రాయానికి మధ్య జరిగిన పోరాటంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న అభిప్రాయానికి మద్దతు పలుకుతారు అన్నది సుప్రీంకోర్టు తీర్పు ఒక ఉదాహరణ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. శివరామకృష్ణ కమిటీ, బోస్టన్ కన్సల్టెంట్ ఇచ్చినటువంటి రిపోర్టులను అప్పటి సీఎం చంద్రబాబు పక్కనపెట్టి నారాయణ కమిటీ తోనే వ్యవహారం నడిపించిందన్నారు. ఆ కమిటీలో అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఉన్నారు. 
తెలుగుదేశం ప్రభుత్వం వేసిన శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన సూచనలు కూడా చంద్రబాబు పట్టించుకోలేదని, తన పదవీకాలంలో రాజధాని ప్రభుత్వ గ్రాఫిక్స్ అయినా నిజం చేసిన సందర్భాలు లేవని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్, ఆ ప్రాంతానికి న్యాయం చేయాలన్న అభిప్రాయానికి ప్రజలు ఓట్లు వేశారా? మంగళగిరిలో, తాడికొండలో ఓడిపోయారని మంత్రి గుడివాడ అమర్నాథ్ గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందని, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ జరిగిన ఎన్నికల ప్రచారంలో వైసీపీకి ఓటు వేస్తే మూడు రాజధానికి మద్దతు తెలిపినట్టేనని ప్రజలను నమ్మబలికారని చెప్పారు. 


అతిపెద్ద స్కాం అమరావతి..
‘అమరావతి అతి పెద్ద స్కాం అందులో ఎటువంటి ఆలోచన లేదు. రాజధాని పేరుతో భూములు కొలగొట్టి రైతుల దగ్గర తక్కువ ధరకు భూములు కొనుక్కొని రాజధాని వస్తుందని మభ్యపెట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలన్న చంద్రబాబు నాయుడు ఆలోచన లు ఒకటి ఒకటిగా బయటికి వస్తున్నాయి. మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న  జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు, విధానాల్ని అడ్డుకోలేరు. విజయవాడ గుంటూరు నగరాలు ఏమైనా అభివృద్ధి చెందయ్యా, ఆ పక్కనున్న ప్రాంతాలు ఏమైనా అభివృద్ధి చెందయ్యా లేదే. ఎక్కడైనా రాజధాని కోసం ఇటువంటి లోకేషన్ ఎప్పుడైనా ఎక్కడైనా ఎంపిక చేశారా? 2001లో ఎన్డీఏ కన్వీనర్ చంద్రబాబు నాయుడు కదా అప్పట్లో దేశంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడితే ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి చెందిన నగరాల్లోనే రాజధాని ఏర్పాటు చేసిన విషయం చంద్రబాబుకు తెలియదా?’ అని ప్రశ్నించారు.


రాజధాని ఏర్పాటుకు రాజకీయ అనుభవం అవసరం లేదు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం అవసరం లేదన్నారు. ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించకుండా ఉండాలనే ఉద్దేశం ఉంటే, రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకుండా ఉండాలని ఆలోచన ఉంటే.. జేబులు నింపుకోవడానికి చేస్తున్న వ్యాపారం కాదని అనుకుంటే నీకు ఈ మూడు రాజధాని ఆలోచన వచ్చి ఉండేది. మీ ఆలోచనలన్నీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. కేవలం స్వార్థంతో ఈ రాష్ట్రమంతా నాది నా వాళ్లంతా బాగుపడాలని ఆలోచనతో చంద్రబాబు వ్యవహరించారని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు.


పాదయాత్రల పేరుతో ప్రజలను రెచ్చగొట్టారు. ఆ పాదయాత్ర ఏమయ్యాయి. ఐడి కార్డులు అడగగానే ఎందుకు దాక్కున్నారని, ఆ పాదయాత్రలో రైతులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వాళ్లు రైతులు కాదని, పాదయాత్రలో పాల్గొన్నదంతా అపర కుబేరులని, పెయిడ్ ఆర్టిస్టులతో వారం పది రోజులు నడిపించారు ఐడి కార్డులు అడగగానే పాదయాత్ర ఆపేశారంటూ మండిపడ్డారు. అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాల్సిన చంద్రబాబు ఆ విషయం మరిచిపోయారని విమర్శించారు.