Amit Shah In Vizag: కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ పాలనకు 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా... దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా అమిత్ షా వైజాగ్ కు వచ్చారు. రైల్వే గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో అమిత్ షా వైజాగ్ చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సహా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
అమిత్ షా బహిరంగ సభ సందర్బంగా నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో బందోబస్తుకు సంబంధించి అధికారులతో విశాఖ నగర పోలీసు కమిషనర్ డా.సి.యం.త్రివిక్రమ వర్మ సమావేశం నిర్వహించారు. మొత్తం నలుగురు డిసిపీ లు, రెండు ఏ.పి.ఎస్.పి ప్లటూన్లు, 04 స్పెషల్ పార్టీ లతో మొత్తంగా 950 సిబ్బంది, అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనకు పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేశారు.
కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటించే ప్రాంతాలైన ఐ.ఎన్.ఎస్ డేగ, ఎయిర్ పోర్ట్, వాల్తేరు రైల్వే గ్రౌండ్స్ బస చేయనున్న పోర్టు గెస్ట్ హౌస్, సాగర్ మాల కన్విక్షన్ సెంటర్ తో పాటూ ఆయన పర్యటించనున్న ప్రతీ ప్రాంతంలో పటిష్ట బందొబస్తూ నిర్వహించాలని అధికారులను విశాఖ సీపీ ఆదేశించారు. వాస్తవానికి అమిత్ షా ఈనెల 8న విశాఖకు రావాల్సి ఉంది. కానీ వేరే కార్యక్రమాలు ఉన్నందున విశాఖ పర్యటనను నేటికి వాయిదా వేసుకున్నారు. కాగా, నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మరుసటి రోజే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనతో ఏపీపై బీజేపీ పట్టుకోసం ఫోకస్ చేస్తోంది.