PM Modi : రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి సీఎం జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్ షో లో విశాఖ మారుతి జంక్షన్ వద్ద ప్రజలకు ప్రధాని అభివాదం చేశారు. ప్రధాని మోదీ విశాఖ వాసులు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడి మోదీ కాన్వాయ్ పై పూల వర్షం కురిపించారు.  






ప్రధాని రోడ్ షో 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల పర్యటన కోసం శుక్రవారం సాయంత్రం విశాఖ నగరం చేరుకున్నారు. విశాఖలోని నౌకాదళ స్థావరం ఐఎన్ఎస్ డేగకు చేరుకున్న ప్రధానికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్,  ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విశాఖ మారుతి కూడలి వద్ద నుంచి ప్రధాని రోడ్‌ షో నిర్వహించారు.  ప్రధాని మోదీ రోడ్ షో లో భారీగా ప్రజలు, బీజేపీ కార్యకర్తలకు పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ 1.5 కి.మీ మేర మోదీ రోడ్‌ షో సాగింది. ప్రధాని రోడ్‌ షో మార్గంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.  షెడ్యూల్‌ ప్రకారం ప్రధాని మోదీ 7.30 గంటలకు విశాఖ చేరుకోవాల్సి ఉండడగా మధురైలో వర్షం కారణంగా  40 నిమిషాలు ఆలస్యంగా మోదీ విశాఖ చేరుకున్నారు.



పవన్ తో భేటీ 


ఐఎన్ఎస్ చోళలో ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. బీజేపీ కోర్ కమిటీ కన్నా ముందే పవన్ ప్రధాని మోదీని కలిశారు. ప్రధాని మోదీ ఏకాంతంగానే పవన్ తో సమావేశం అయ్యారు.  పవన్ తో భేటీ ముగియగానే బీజేపీ నేతలు ప్రధాని మోదీని కలిశారు. ప్రధాని మోదీ, పవన్ భేటీ అరగంటకు పైగా సాగింది. పవన్ తో రాజకీయ సమావేశమే అని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ నేతలతో భేటీపై అజెండా లేదంటున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై ప్రధానితో చర్చిస్తామంటున్నారు బీజేపీ నేతలు.   


భవిష్యత్తులో మంచి రోజులు 


"దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ప్రధాని మోదీతో కలిశాను. ఈ మీటింగ్ ఏపీ బాగుండాలనే ఉద్దేశంతో కలిశారు. ప్రధాని మోదీ ఏపీలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఏపీకి మంచిరోజులు వస్తాయి. ఏపీ బాగుండాలనేది ప్రధాని ఆకాంక్ష. నాకు అవగాహన ఉన్నంత మేరకు ప్రధాని అన్ని వివరాలు తెలియజేశాను. త్వరలో అన్ని విషయాలు చెబుతాను. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రధాని మోదీని కలిశాను." - పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు 






 


Also Read : Kiran Royal Arrest : తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ అరెస్టు, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?