Minister Vidadal Rajini : టీడీపీ అధినేత చంద్రబాబు హయంలోనే విశాఖలో భూ కుంభకోణాలు జరిగాయని మంత్రి విడదల రజిని ఆరోపించారు. విశాఖలో పర్యటించిన మంత్రి... టీడీపీపై విమర్శలు చేశారు. టీడీపీ హయాంలోనే విశాఖలో భూముల రికార్డుల టాంపరింగ్ జరిగాయన్నారు. విశాఖ జిల్లా అభివృద్ధిపై సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో 21 అంశాలు చర్చించామన్నారు. జిల్లాలో పేదలకు లక్ష ఇళ్లు మంజూరు చేశామన్నారు. మరో 25 వేల ఇళ్లను త్వరలో అందజేయడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 46 వేల మంది వైద్య సిబ్బందిని ఇటీవల రిక్రూట్ చేశామని మంత్రి రజిని తెలిపారు.
వైసీపీ హయాంలో అవినీతికి అవకాశం లేదు
"వైద్య ఆరోగ్య శాఖ అభివృద్ధికి సీఎం చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో అవినీతికి అవకాశం లేదు. చంద్రబాబుకు ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇష్టముండదు. అందుకే అమరావతి రైతుల ముసుగులో ఉత్తరాంధ్రపై దాడికి ఉసుగొలుపుతున్నారు. వైసీపీ నాయకులుగా మేం అమరావతి రైతుల విషయంలో ఎలాంటి దుందుడుగు చర్యలు చేపట్టం. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతిని ఏదైనా జరిగితే దానికి చంద్రబాబు నాయుడు బాధ్యత వహిస్తారు. విశాఖ భూముల దోపిడీకి ఆద్యులు టీడీపీ నాయకులే"- మంత్రి విడదల రజిని
ముసుగు తొలగిపోయింది
చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ నడుస్తున్నాడని, ఇప్పటి వరకు ముసుగులో ఉన్న వారిద్దరి బాగోతం ముసుగు తొలగడంతో బయటకు వచ్చిందని ఇటీవల మంత్రి విడదల రజిని అన్నారు. ఇటీవల చంద్రబాబు పల్నాడు పర్యటనపై విడదల రజిని విమర్శలు చేశారు. ఏ మొహం పెట్టుకొని చంద్రబాబు పల్నాడు పర్యటన చేశారని మండిపడ్డారు. అధికారంలో ఉండగా రైతులను ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు పల్నాడు జిల్లాలో పంట పొలాల పరిశీలన ఏ ముఖం పెట్టుకుని చేస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు రైతులను మోసం చేశారన్నారు. చంద్రబాబు, కరువు రెండు కవల పిల్లలని మంత్రి విడదల రజిని విమర్శించారు.
అమరావతిదే అంతిమ గెలుపు - శంకుస్థాపనకు ఏడేళ్లు ! చంద్రబాబు స్పందన ఇదే
పవన్ పై విమర్శలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి విడదల రజిని విమర్శించారు. వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని మంత్రి విడదల రజిని అన్నారు. పవన్ కల్యాణ్ లాంటి మనస్తత్వం ఉన్న వారు రాజకీయాలకు పనికి రారన్నారు. పవన్ సినిమా డైలాగులు చెప్పడం తప్పా చేసిందేమీ లేదని విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Pawan Kalyan Mahila Commision : పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ షాక్ - క్షమాపణ చెప్పాలని నోటీస్ !