Gajuwaka Ganesh Idol : విశాఖ గాజువాకలో ఏర్పాటు చేసిన 89 అడుగుల వినాయక మట్టి విగ్రహం పక్కకు ఒరిగిపోయింది. ఒక అడుగు మేర పక్కకు ఒరిగిపోవడంతో విగ్రహం పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వినాయక విగ్రహాన్ని. మండపాన్ని పరిశీలించారు. ఆర్ అండ్ బీ అధికారులకు సమాచారం ఇవ్వడం అధికారులు విగ్రహాన్ని పరిశీలించి విగ్రహం పడిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ భారీ వినాయకుడి దర్శనం చేసుకునేందుకు నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఏ క్షణంలోనే ప్రమాదం జరగొచ్చని అలెర్ట్ అయిన పోలీసులు విగ్రహానికి 100 మీటర్లలోపు భక్తులను అనుమతించడంలేదు.  


సోమవారం నిమజ్జనం 


విగ్రహం పక్కకు ఒరిగిపోవడంతో వెంటనే నిమజ్జనం పూర్తి చేయాలని పోలీసులు ఉత్సవ కమిటీ సభ్యులను కోరారు. ఈ నెల 18వ తేదీన నిమజ్జనం చేయాలని నిర్ణయించామని ఉత్సమ కమిటీ సభ్యులు ముందుగా చెప్పారు. వర్షాలు కురుస్తుండడంతో విగ్రహం పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు సూచించడంతో సోమవారం నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు. పోలీసుల సూచనలతో దర్శనాలు నిలిపివేశారు. అయితే ఈ విషయంపై కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని గాజువాక గణేశ్‌ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. 


భారీ వినాయకుడు 


ప్రతీ ఏడాది విశాఖపట్నంలో అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంచారు. ఈ ఏడాది కూడా తెలుగు రాష్ట్రాల్లోనే ఎత్తైన 89 అడుగుల వినాయక విగ్రహాన్ని గాజువాకలో ఏర్పాటు చేశారు. భక్తుల పూజలందుకుంటున్న ఈ భారీ వినాయకుడి విగ్రహం శనివారం పక్కకు ఒరిగిపోవడంతో కూలిపోయే ప్రమాదం ఉందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నగరంలోని గాజువాక లంకా మైదానంలో 89 అడుగుల కైలాస విశ్వరూప మహా గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు.  మూడు కన్నుల గణేశుడికి ఒక కన్ను శివుడు, మరో కన్ను పార్వతి దేవి రూపాలతో రూపొందించారు.  


35 కిలోల లడ్డూ 


కైలాస విశ్వరూప మహా గణపతి వద్ద 35 కిలోల భారీ లడ్డూ ఏర్పాటుచేశారు. తాపేశ్వరంలోని ప్రసిద్ధ స్వీట్ షాప్‌ శ్రీ భక్త ఆంజనేయ సురుచి ఫుడ్స్ వారు ఈ భారీ లడ్డూను తయారు చేసి మహా గణపతికి సమర్పిస్తున్నారు. గతంలో వీరు సమర్పించిన లడ్డూ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌కు ఎక్కింది. ఈ విగ్రహాన్ని ఖైరతాబాద్‌కు చెందిన శిల్పకారుడు చిన్నస్వామి రాజేంద్రన్‌ ఒడిశా, తమిళనాడుకు చెందిన కళాకారుల సహకారంతో తెల్ల మట్టి, వెదురు కర్రలతో నిర్మించారు. ఈ వినాయక విగ్రహాన్ని దర్శించుకునేందుకు నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు వస్తున్నాయి. ఇంత భారీ సైజులో విగ్రహాన్ని ఏర్పాటుచేయడంతో ఉన్న చోటనే నిమజ్జనం చేస్తారు నిర్వాహకాలు. సెప్టెంబర్ 18న నిమజ్జనం చేసేందుకు ఏర్పాటుచేయగా విగ్రహం పక్కకు ఒరిగిపోవడంతో సోమవారం నిమజ్జనం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 


Also Read : TTD Updates: తిరుమలలో భక్తుల రద్దీ, సర్వదర్శనానికి ఒకరోజు టైం పడుతోంది: టీటీడీ


Also Read : దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు జాతీయ ప్రతిభా పురస్కారం