Karnataka councillor : రాజకీయ నేతల్లో చాలా మందికి వైట్ కార్డులు ఉంటాయి. అంత మాత్రాన వారాంతా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారు కాదు.. కనీ రికార్డుల్లో మాత్రం వారు పేదవారే. బయటపడిన తర్వాత అయ్యో.. ఆయన అంతపేదవాడా అని.. వెటకారంగా జనం సెటైర్లు వేస్తారు. కానీ చట్టపరంగా పెద్దగా చర్యలు ఉండవు. అయితే కర్ణాటకకు చెందిన ఓ కౌన్సిలర్‌కు మాత్రం పదవి ఊడిపోయింది. దీనికి కారణం ఆయనకు ఐదు వందల కేజీల ఆభరణలు ఉన్నా కూడా .. తాను నిరుపేదనని చెప్పి బీపీఎల్ కార్డు తీసుకున్నాడు. ఆ కార్డు చూపించి అన్ని సౌకర్యాలు ప్రభుత్వం నుంచి పొందుతున్నాయి. తన ఎన్నికల అఫిడవిట్‌లోనూ తనకేమీ ఆస్తులు లేవని చెప్పాడు.
అయితే నిజం ఎప్పటికైనా నిప్పులాంటిదే కాబట్టి.. ఓ సారి బయటకు వచ్చింది. ఆయన భవిష్యత్‌ను కాల్చేసింది. ఎన్నికల అఫిడవిట్‌ను సంపాదించిన ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణప్ప..2021 డిసెంబర్‌లో కోర్టు కేసు నమోదు చేశారు. క్రిమినల్ కేసులు ఉన్న విషయాన్ని అఫిడవిట్‌లో రవిశంకర్ పేర్కొనలేదని ఆరోపణలు చేశాడు. కౌన్సిలర్ రవిశంకర్ వద్ద 500 కిలోల ఆభరణాలు ఉన్నాయని, 3.6 లక్షల వరకూ ప్రతి నెలా అద్దెల రూపంలో ఆదాయం వస్తుందన్న విషయాన్ని కూడా అఫిడవిట్‌లో చెప్పలేదని అతనిపై కేసు బుక్ చేశారు. రవిశంకర్ వద్ద బీపీఎల్ కార్డు కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.విచారణ జరిపిన కోర్టు నిజమేనని తేల్చింది. రవిశంకర్‌కు బీపీఎల్ కార్డు ఉన్నా.. అతను తన అఫిడవిట్‌లో 500 కేజీల ఆభరణాల గురించి వెల్లడించలేదని మెజిస్ట్రేట్ తేల్చారు.
తనకు ఉన్న ఆస్తులు ఆభరమాల గురంచి రవిశంకర్ కూడా న్యాయస్థానం ముందు అంగీకరించారు. తనపై ఉన్న క్రిమినల్ కేసులు చాలా పాతవని అందుకే వాటిని ప్రస్తావించలేదన్నారు. అదే సమయంలో తన వద్ద ఉన్న ఆభరణాల సంగతిని కూడా చెప్పలేదన్నారు. ఐదు వందల కేజీల ఆభరణాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే అందులో అరకేజీ మాత్రమే బంగారం. మిగతా నాలుగున్నర వందల కేజీలు వెండి. రవిశంకర్ చెప్పిన విషయాలతో ఆయన తప్పు చేసినట్లుగా నిర్ధారించిన మెజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. జేడీఎస్ కౌన్సిలర్ రవి శంకర్ ఎన్నిక చెల్లదని మెజిస్ట్రేట్ పేర్కొన్నది.
ఇలాంటి ప్రజాప్రతినిధులు ప్రతీ రాష్ట్రంలోనూ ఉంటారు. ఏపీలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికి బియ్యం పంపిణీ ప్రారంభించారు. ఈ పథకం పలాస నియోజకవర్గంలో అద్భుతంగా సాగుతోంది అప్పట్లో ఎమ్మెల్యే.. ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీదిరి అప్పలరాజు .. తనకు అందిన బియ్యం సంచి ముందు కుటుంబం మొత్తం నిలబడి ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అందరికీ ఒకటే డౌట్ వచ్చింది. అది పథకం అమలు గురించి కాదు.. స్థితిమంతుడైన అప్పల్రాజుకు.. అసలు రేషన్ కార్డు ఎలా వచ్చిందనేదే. దీనిపై దుమారం రేగడంతో ఆయన తన రేషన్ కార్డును సరెండర్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఎవరూ కోర్టుకెళ్లలేదు.