Jagan On Laddu Controversy: టీటీడీ బోర్డు అనేది చాలా విశిష్టమైంది. దాన్ని కూర్పు చేయడం చాలా కష్టం. ఆ బోర్డు కోసం రికమండేషన్స్ చాలా చోట్ల నుంచి వస్తాయి. చుట్టుపక్కల ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, కేంద్రమంత్రుల నుంచి రికమండేషన్స్ వస్తాయి. చాలా ప్రముఖులు బోర్డులో సభ్యులు అవుతారు. వాళ్లంతా వీటిని రాటిఫై చేస్తారు. ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోదు. టీటీడీ స్వతంత్ర వ్యవస్థ అనేది గుర్తు పెట్టుకోవాలి. పాదర్శకతకు పెద్ద పీట వేస్తూ దేవుడికి మంచి చేయడం ఎలా అనే ఒక్క మైండ్ సెట్‌తో పని చేసే వాళ్లు బోర్డులో ఉంటారు.
వైవీ సుబ్బారెడ్డి 45 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నారు. అంత కంటే గొప్ప వ్యక్తి ఎవరైనా టీటీడీబోర్డు మెంబర్ అవుతారా చెప్పండి. అంత కంటే భక్తుడు ఎవరైనా ఉంటారా... స్వాముల్లో సూపర్ స్వామి... గురు స్వామి స్టేజ్ ఆయనది. కరుణాకరెడ్డి కూడా అదే స్థాయి వ్యక్తి. మనం ఏం మాట్లాడుతున్నాం... మన సంస్థలను, మన స్వామి స్థాయిని తగ్గించుకుంటున్నాం. ఉన్నది చెప్పుకోవడం ఇష్టం లేక.. దుర్బుద్ధితో ఇలాంటి కార్యక్రమాలు చంద్రబాబు మాత్రమే చేయగలరు. అదే మన రాష్ట్రం చేసుకున్న దుర్మార్గం.
వైసీపీ వచ్చిన తర్వాతే నవనీత సేవ చేపట్టాం. దీని కోసం స్వచ్ఛమైన నేయి తయారీకి ప్రత్యేక గోశాల పెట్టాం. అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం. ప్రసాదాలు తయారు చేసే పోటు కార్మికుల సర్వీస్ క్రమబద్ధీకరణతోపాటు జీతాలు పెంచాం. చంద్రబాబు దేవాలయాలు కూల్చేస్తే, వాటితోపాటు జీర్ణోద్దరణకు చేరుకున్న అనేక ఆలయాలు అభివృద్ధి చేసింది వైసీపీనే. అమారావతి, వైజాగ్, భువనేశ్వర్, హైదరాబాద్, జమ్ముకాశ్మీర్, చెన్నైలో ఆలయం కట్టింది వైసీపీ. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తున్న ఉద్యోగులకు అండగా ఉంది వైసీపీనే. 9 వేల మందికి ఇళ్ల పట్టాలు అందించాం.