Vijayawada Girl Talent: బియ్యం గింజలపై రామాయణం రాసి అబ్బురపరుస్తోంది విజయవాడ (Vijayawada) గొల్లపాలెం గట్టుకు చెందిన కారుమూరి మౌళ్య పద్మావతి శ్రీవల్లి. చిన్నతనం నుంచి చిత్రలేఖనంపై మక్కువతో అనేక పోటీల్లో పాల్గొని బహుమతులెన్నో సాధించింది. పదేళ్ల వయస్సు నుంచే బియ్యం గింజలపై అక్షరాలు రాయడం నేర్చుకొని అనేక ప్రాజెక్టులు రూపొందించింది. రామాయణంలోని ముఖ్యాంశాలతో ఓ చిత్రపటాన్ని రూపొందించి వరల్డ్ బుక్ రికార్డుల్లోకి సైతం స్థానం దక్కించుకోబోతోంది. స్వాతంత్య్ర సమరయోథుడి జీవిత చరిత్రను బియ్యపు గింజలపై లిఖించడమే తన జీవిత లక్ష్యమని పద్మావతి చెబుతోంది.
ఎవరైనా అక్షరాలు ఎక్కడ రాస్తారు.. పుస్తకంలోనే కదా మళ్లీ అడుగుతారెందుకు అనుకుంటున్నారా.. ఆగడాగండి.. విజయవాడ (Vijayawada) గొల్లపాలెం (Gollapalem) గట్టుకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న కారుమూరి మౌళ్య పద్మావతి శ్రీవల్లి (Karumuri Moulya Padmavati Srivalli) మాత్రం బియ్యం గింజలపై అక్షరాలను అలవోకగా రాస్తూ అందరినీ అబ్బురపరుస్తోంది. చిన్నతనం నుంచే చిత్ర లేఖనం (Painting Art) అంటే ఆమెకు ప్రాణం. ఆయిల్ పెయింటింగ్, వాటర్ పెయింటింగ్, పాట్ పెయింటింగ్ ఇలా అనేక ప్రక్రియల్లో అందమైన చిత్రాలు ఎన్నింటినో మనసుకు హత్తుకునేలా చిత్రించి పలువురి ప్రశంసలు అందుకుంది. పాఠశాలలో నిర్వహించిన అనేక పోటీల్లోనూ (Painting Competition) బహుమతులు ఎన్నో దక్కించుకుంది.
అందరిలా కాగితంపై చిత్రాలు గీయడం కంటే బియ్యం గింజలపై అక్షరాలు రాస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అంతే ఒకచోట మైక్రో ఆర్టిస్ట్ బియ్యం గింజలపై అక్షరాలు రాయడం చూసి ఆ విద్యను నేర్చుకుంది. తనలోని ప్రతిభకు మరింత పదును పెట్టి ఒక్క గింజపై 8 అక్షరాల వరకూ రాసి ఔరా అనిపించింది. శ్రీరాముడిపై (Lord Sri Rama) ఉన్న భక్తితో రామాయణాన్ని (Ramayanam) ప్రజలందరికీ చేరువ చేయాలనే మంచి సంకల్పంతో 15 రోజులు శ్రమించి రామాయణంలో ఏడు కాండాల్లోని సారాన్ని క్లుప్తంగా బియ్యం గింజలపై రాసింది. వీటిని అన్నింటిని రాముడి చిత్రపటం చుట్టూ అమర్చింది. రాములవారి పటం చుట్టూ జాతీయ భాషలన్నింటిలోనూ బియ్యపు గింజల పై శ్రీరామ శ్రీరామ (Sri Rama) అని రాసి అమర్చింది. ఈ ప్రాజెక్టును దాతలు ఎవరైనా సహకరిస్తే ప్రముఖ రామ మందిరాలలో ప్రదర్శించడమే తన లక్ష్యమని చెబుతోంది.. పద్మావతి శ్రీవల్లి.
Also Read: Special Trains: ఈ సమ్మర్‌లో స్పెషల్ రైళ్లు ఇవే, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికంటే
Also Read: Nampally Court: గంజాయితో పట్టుబడ్డ వ్యక్తి - రెండేళ్లకి నాంపల్లి కోర్టు సంచలన తీర్పు